కృష్ణా: తోట్లవల్లూరు (మం) బందరు కాలువ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి తోట్లవల్లూరు మండలం పాములలంక గ్రామానికి చెందిన పిల్లి సోమేశ్వరరావుగా (40) గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై అర్జున్ రాజు కేసు నమోదు చేశారు.