ఆగ్నేయ అమెరికాలో హరికేన్ హెలెనా బీభత్సం సృష్టించింది. ఫ్లోరిడాతో పాటు జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా ప్రాంతాల్లో ఇది పెను ప్రభావం చూపించింది. ఆయా ప్రాంతాల్లో 44 మంది మృతి చెందారు. పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో రోడ్లు, ఇళ్లు, వాణిజ్య సముదాయాల్లోకి నీరు చేరింది. ఘటనాస్థలాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీని కారణంగా 15-26 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.