బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జీవిత పుత్రిక పర్వదిన సందర్భంగా రెండు వేర్వేరు గ్రామాల్లో చెరువులో స్నానాలు చేస్తూ 8 మంది చిన్నారులు మునిగిపోయారు. చిన్నారుల మృతిపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.