VZM: వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై బి.దేవి తన సిబ్బందితో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వావిలపాడు గ్రామంలో ఓ మహిళ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 6 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్మినా, నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.