KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల మంగళవారం రాత్రి వరకు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నందవరం మండలం కనకవీడు గ్రామంలో నరసింహుడు అనే వ్యక్తి మట్టి మిద్దె వర్షానికి కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకుపోవడంతో ప్రమాదం తప్పింది. పలు చోట్ల వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.