ప్రకాశం: సింగరాయకొండలోని లారీ యూనియన్ ఆఫీస్ ఎదురుగా కలకత్తా నుంచి బెంగళూరుకు వెళుతున్న కూరగాయల లారీని,మరో లారీ ఎదురుగా ఢీకొట్టిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో కూరగాయల లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను జేసీబీ సహాయంతో బయటకు తీశారు.కాగా డ్రైవర్‌కు కాలు నలిగి విరిగిందని పేర్కొన్నారు.