MNCL: మంచిర్యాల రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫాం నెంబర్- 2 గద్దెపై నుండి కింద పడి గుర్తుతెలియని వృద్దుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుడివైపు నుదుటిపై బలమైన గాయమైన వృద్ధుడిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృద్దుడు వివరాలు తెలిసిన వారు 8712658596, 9701112343 నంబర్లకు సమాచారం ఇవ్వాలని జీఆర్పీ ఎస్ఐ ఎ. మహేందర్ తెలిపారు.