KRNL: మంత్రాలయం మండలం చిలకలడోనా శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సై పరమేశ్ నాయక్ వివరాల మేరకు.. బెంగళూరు నుంచి మంత్రాలయానికి వస్తున్న కారును రోడ్డు పక్కన ఆపారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గకి చెందిన టెంపో వాహనం కారుని వెనక నుంచి ఢీకొంది. కారులో ఉన్న వికాస్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. టెంపో డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులన్నారు.