ఇరాన్‌లోని బొగ్గు గనిలో గత రాత్రి భారీ పేలుడు సంభవించింది. టెహ్రాన్‌కు సమీపంలోని తబాసలోని బొగ్గు గనిలో మిథేన్ గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 మంది చనిపోగా.. 24 మంది శిథిలాల మధ్యలో చిక్కుకున్నారు. ఈ ప్రమాద సమయంలో 69 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన నుంచి 28 మంది సురక్షితంగా బయటపడ్డారు. దీనిపై స్పందించిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్.. బాధితులకు అవసరమైన సాయం తక్షణమే అందించాలని వెల్లడించారు.