NLR: పొదలకూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురం కాలనీలో అక్రమ మద్యం విక్రయాలపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ హనీఫ్ కు వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడులు నిర్వహించగా 28 మద్యం బాటిళ్లతో సహా శ్రీనివాసులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ దాడుల్లో సిబ్బంది ఇలియాజ్, సుబ్బారావు, రమేష్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.