బిహార్లో ‘జీవిత్పుత్రిక’ పండగ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని నదుల్లో పవిత్ర స్నానాలకు ప్రజలు పోటెత్తారు. ఈ క్రమంలో 15 జిల్లాల్లో ప్రమాదవశాత్తు 43 మంది మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.