TG: డ్రగ్స్ కేసులో సినీ నటుడు అభిషేక్ అరెస్టయ్యాడు. SR నగర్, జూబ్లీహిల్స్ పీఎస్‌లో అభిషేక్ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల విషయంలో కోర్టుకు హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ చేశారు. దీంతో పారిపోయి గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే న్యాబ్ పోలీసులు అభిషేక్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్ సీసీఎస్‌కు తరలించారు.