NRML: భైంసా మండలంలోని కోతుల్గాం గ్రామానికి చెందిన అమెడా గజ్జన్న (50) డాబాపై నుంచి పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శనివారం రాత్రి గజ్జన్న ఇంటి ప్రక్కన శుభకార్యానికి వెళ్ళాడు. అక్కడ బాల్కనీ నుండి కిందికి చూస్తూ కాలుజారి కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. భార్య రుక్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమో చేసుకున్నారు.