MNCL: నెన్నల మండలం కోనంపేట గ్రామానికి చెందిన ఐలయ్య గొర్రెల మందపై తోడేళ్లు దాడి చేయడంతో 6 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడి వివరాల ప్రకారం.. గురువారం మేతకు వెళ్లిన గొర్రెలను సాయంత్రం ఊరు బయట మందలో ఉంచారు. ఈ క్రమంలో తోడేళ్లు ఒక్కసారిగా మందపై దాడి చేసి 6 గొర్రెలను పట్టుకొని లాక్కెల్లాయి.