TG: ఓ ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ప్రమాదం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కళాశాల బస్సులు ఆటోను తప్పించబోయి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం కారణంగా నర్సాపూర్-సంగారెడ్డి మధ్య భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.