ప్రకాశం: కనిగిరి మండలం మాచవరంలో ఉరి వేసుకుని బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతుడి పెదనాన్న ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్న మధుసూదన్ (14) మాచవరంలోని అమ్మమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.