GDWL: గద్వాలలో సీనియర్ అసిస్టెంట్ అశోక్ గురువారం ఉరివేసుకున్న విషయం తెలిసిందే. అశోక్ ఇటివలే పెబ్బేరుకు బదిలీ అయ్యారు. ఆర్థిక సమస్యల వల్లే తన భర్త సూసైడ్ చేసుకొని ఉండవచ్చని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై కల్యాణ్‌కుమార్ తెలిపారు. కాగా తాను షేర్ మార్కెట్లో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టానని, ఇందులో తన ఫ్రెండ్స్‌వి రూ.20 లక్షలు ఉన్నాయని రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.