సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను ఓ 32 ఏళ్ల మహిళ నమ్మించి మోసగించింది. మీ ఫ్యాన్ అంటూ.. అతడితో ఫొటోలు దిగుతూ రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలను కాజేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో ఆమెతోపాటు ఆమె భర్తనూ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్ఫ్లుయెన్సర్ను బురిడీ కొట్టించి మహిళ దొంగిలించిన 100 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.