అమెరికాలోని అయోవా రాష్ట్రంలో శీతాకాల సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజు 17 ఏళ్ల విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆరో తరగతి విద్యార్థి మరణించాడు, ఐదుగురు గాయపడ్డారు.
2024 సంవత్సరం ప్రారంభమే గౌతమ్ అదానీకి మంచి శుభారంభాన్ని అందించింది. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పుతో అదానీ గ్రూప్‌కు పెద్ద ఊరట లభించింది. గౌతమ్ అదానీ వ్యక్తిగత నికర విలువ కూడా వేగంగా పెరుగుతోంది.
జమ్మూకశ్మీర్‌లో ఇవాళ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. NCS ప్రకారం, భూకంపం మధ్యాహ్నం 12.38 గంటలకు 5 కి.మీ లోతులో సంభవించింది.
జార్ఖండ్ మైనింగ్ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ తర్వాత ఆయన సన్నిహితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు కఠిన చర్యలు ప్రారంభించింది.
లోక్‌సభ ఎన్నికల తేదీలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జనవరి 7 నుంచి జనవరి 10 వరకు రాష్ట్రాల్లో పర్యటించనుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్, ఇతర దక్షిణాది రాష్ట్రాలను సందర్శిస్తారని తెలుస్తోంది.
నిర్మల్ జిల్లా దిలవార్ పూర్ మండల కేంద్రంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపియాలంటూ ఆ గ్రామానికి చెందిన దాదాపు 600 మంది రైతులు ఫ్యాక్టరీపై దాడికి దిగారు.
జనవరి వచ్చిందంటే చాలా మంది స్కూల్ పిల్లలు సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు. కొత్త సంవత్సరం, సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం వంటి సెలవులతో నెలంతా గడిచిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించింది.
జైలులో కులం ఆధారంగా వివక్ష చూపుతున్నారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు... కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా 11 రాష్ట్రాల నుంచి సమాధానాలు కోరింది.
జపాన్‌లో వరుస భూకంపాలు ఆ దేశ ప్రజలను వణికిస్తున్నాయి. ఇటీవల రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. భూమి ఏకంగా 18గంటల్లో 155సార్లు కంపించింది.
ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని హిందువుల కలను నెరవేర్చింది. ఈ ప్రారంభోత్సవానికి ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు హాజరవుతారు.