• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రసాయనిక ఎరువులతో నష్టం: AD

SKLM: రైతులు రసాయనిక ఎరువుల వైపు మొగ్గు చూపించకుండా ప్రకృతి సేద్య వ్యవసాయంపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ ఏడీ వెంకట మధు తెలిపారు. శుక్రవారం సాయంత్రం జలుమూరు మండలం అక్కురాడ వ్యవసాయ క్షేత్రంలో రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రసాయనక ఎరువులతో భూసారం తగ్గుతుందని వివరించారు. ప్రకృతి వ్యవసాయంతో లాభం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రవికుమార్ పాల్గొన్నారు.

April 25, 2026 / 09:31 AM IST

VRS చెల్లింపుల జాప్యంపై ఉక్కు యాజమాన్యానికి నోటీసు

VSP: వీఆర్ఎస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంపై ఉక్కు యాజమాన్యానికి ఉద్యోగులు లీగల్ నోటీసు పంపారు. వీఆర్ఎస్ ఉద్యోగులకు పూర్తి పరిహారం, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పెండింగ్ జీతాలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 130 మంది ఉద్యోగులు న్యాయవాది వి. శ్రీనివాసమూర్తి ద్వారా నోటీసు పంపిస్తూ, 7 రోజుల్లో 12% వడ్డీతో చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు.

April 25, 2026 / 09:30 AM IST

ఎస్సైల తాత్కాలిక బాధ్యతలు.. ఎస్పీ ఉత్తర్వులు

సత్యసాయి: జిల్లా పోలీస్ విభాగంలో పరిపాలనా కారణాలతో కొన్ని పోలీస్ స్టేషన్లకు ఎస్సైల తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. హిందూపురం, చిలమత్తూరు, మహిళా పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు అధికారులు నియమితులయ్యారు. సంబంధిత అధికారులు వెంటనే కొత్త స్థానాలకు చేరి విధులు స్వీకరించాలని ఆదేశించారు.

April 25, 2026 / 09:29 AM IST

ఫిరంగిపురంలో డీజిల్ కొరత.. వాహనదారుల ఇబ్బందులు

GNTR: ఫిరంగిపురం మండలంలోని అన్ని కంపెనీల పెట్రోల్ బంకుల్లో శుక్రవారం రాత్రి నుంచి డీజిల్ సరఫరా నిలిచిపోయింది. ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా లేకపోవడంతో బంకుల్లో డీజిల్ పూర్తిగా ఖాళీ అయింది. దీంతో లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై బంకు యజమానులు మాట్లాడుతూ.. సరఫరా అంతరాయం కారణంగానే డీజిల్ నిలిచిపోయిందని తెలిపారు.

April 25, 2026 / 09:23 AM IST

రేపు పలమనేరులో వ్యాపార సంస్థల మూసివేత

CTR: ఆర్యవైశ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వాసవి అమ్మవారి జయంతిని ఈనెల 26న పలమనేరులో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా  వ్యాపార సంస్థలు మూసివేస్తున్నట్లు ఆర్య వైశ్యులు తెలిపారు. తమ కుల దైవం వాసవి మాత జయంతి ఉత్సవాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటున్నందున తమ వ్యాపార సంస్థలను మూసి వేస్తున్నట్లు వారు తెలిపారు.

April 25, 2026 / 09:17 AM IST

ఇఫ్కో సెజ్‌లో రూ.10వేల కోట్లతో పరిశ్రమలు: ఎమ్మెల్యే

NLR: ఇఫ్కో కిసాన్ సెజ్‌లో రూ.10వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. శుక్రవారం కోవూరులోని 17,18 వార్డులలో ఆమె పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 30 ఏళ్లుగా కదలిక లేని ఇఫ్కో కిసాన్ సెజ్‌లో కూటమి ప్రభుత్వం కదలికలు తెచ్చిందన్నారు. పరిశ్రమల ద్వారా యువతకు భారీగా ఉపాధి కలుగుతుందన్నారు. 

April 25, 2026 / 09:17 AM IST

మోపూరు భైరవేశ్వరుని ఆదాయం ఎంతంటే..?

KDP: వేముల మండల పరిధిలోని నల్లచెరువుపల్లి సమీపంలో ప్రసిద్ధి చెందిన పురాతన మోపూరు భైరవేశ్వరస్వామి దేవాలయానికి రూ.28.90 లక్షల ఆదాయం వస్తోందని ఆలయ ఈవో రమణ తెలిపారు. ఆలయానికి చెందిన 132.80 ఎకరాల భూముల నుంచి సంవత్సరానికి దాదాపు రూ.1లక్ష ఆదాయం లభిస్తోందన్నారు. అలాగే తలనీలాలు, టెంకాయలు, హుండీ లెక్కింపు ద్వారా సుమారు రూ.22 లక్షల వరకు ఆదాయం వస్తోందని వివరించారు.

April 25, 2026 / 09:17 AM IST

‘పట్టణ పారిశుధ్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలి’

E.G: పట్టణ పారిశుధ్ధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు స్వచ్ఛ షెహర్ జోడి కార్యక్రమం దోహదపడుతుందని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. స్వచ్ఛ షెహర్ జోడీ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరానికి అనుసంధానమైన 5 యూఎల్బీలు పిఠాపురం, ముమ్మిడివరం, ఏలేశ్వరం, పలాస-కాశీబుగ్గ, పాలకొండ మునిసిపల్ కమిషనర్లు, సంబంధిత సిబ్బందితో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు

April 25, 2026 / 09:14 AM IST

ఈనెల 28న మండల సర్వసభ్య సమావేశం

TPT: సత్యవేడు ఎంపీడీవో కార్యాలయంలో ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 10:30 గంటలకు మండల సర్వసభ్య సమావేశం జరుగుతుందని MPDO చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఎంపీపీ ప్రతిమ సమావేశానికి అధ్యక్షత వహిస్తారన్నారు. ఈ సమావేశానికి జడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యుడు పాల్గొనాలని కోరారు. సమావేశానికి పంచాయతీ సెక్రటరీలు, అధికారులందరూ తమ ప్రగతి నివేదికలతో హాజరు కావాలన్నారు.

April 25, 2026 / 09:03 AM IST

విశాఖలో హత్యకు గురైన తుని యువకుడు

KKD: విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దారుణ హత్య జరిగింది. కైలాసపురం సమీపంలోని వేంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద తునికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తిని ఆటో డ్రైవర్ రౌతు శ్రీను పొడిచి చంపేశాడు.ఈ ఘటనలో నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు.  వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేశారు. 

April 25, 2026 / 09:01 AM IST

రేపు ఉచిత లాసెట్ మోడల్ పరీక్ష

SKLM: నగరంలో ఉన్న ఓ ప్రైవేటు న్యాయ కళాశాలలో రేపు ఉచిత లాసెట్ మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 10 గంటలకు పరీక్ష కేంద్రం వద్దకు హాజరు కావాలన్నారు. మూడు, ఐదేళ్ల లా కోర్సు చేయాలనుకునే వారికి ఈ మోడల్ లాసెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

April 25, 2026 / 09:00 AM IST

జడ్పీ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన

VZM: కొత్తవలస జడ్పీ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన పాఠశాల ప్రధానోపాద్యాయుడు చీపురుపల్లి ఈశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. డోకుల సింహాద్రి అప్పలనాయుడు, పద్మావతి దంపతులు రూ. 23 వేలు వెచ్చించి సరస్వతీ దేవి ఆలయం పాఠశాల ఆవరణలో నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షురాలు మానస పాల్గొన్నారు.

April 25, 2026 / 09:00 AM IST

ఫిర్యాదు పెట్టెలను పంపిణీ చేసిన పీవో

PPM: ఐటీడీఏ పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి శుక్రవారం స్దానిక ITDA కార్యాలయం గిరిమిత్ర హాలులో గిరిజన సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిశీలించి పరిష్కారం అయ్యేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గిరిజన విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు ఫిర్యాదు పెట్టెలను పంపిణీ చేశారు.

April 25, 2026 / 09:00 AM IST

పోలీస్ పనితీరుని అభినందించిన మంత్రి లోకేష్

ఏలూరు జిల్లా పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమాన్ని మంత్రి లోకేష్ తన X అకౌంట్ ద్వారా అభినందించారు. దొంగిలించబడిన ఆస్తులను రికవరీ చేసి వాటిని నేరుగా బాధితుల ఇంటికే వెళ్లి అందజేస్తుండటం అభినందనీయమన్నారు. ఇటీవలే చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని బాధితుల ఇళ్ల వద్దకే జిల్లా పోలీసులు అందించారు. ఈ పద్ధతి పోలీసు వ్యవస్థలో ఒక కొత్త మార్పు అని మంత్రి అన్నారు.

April 25, 2026 / 08:48 AM IST

వైభవంగా అగస్త్యేశ్వరస్వామి కళ్యాణోత్సవం

KDP: ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం 2వ రోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం గంగా రాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కాలక్షేప మండపంలోని కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. వేద పండితులు కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

April 25, 2026 / 08:43 AM IST