• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మహేంద్రనాథ్ ఆశయ సాధనకు కట్టుబడి ఉంటా: ఎమ్మెల్యే

ATP: మాజీ మంత్రి కీర్తిశేషులు పుట్టపాగ మహేంద్రనాథ్ శతజయంతి ఉత్సవాలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి, పలువురు నేతలు పాల్గొన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉండి, ప్రజా సేవలో ముందుంటానని ఎమ్మెల్యే శ్రావణి పేర్కొన్నారు.

April 26, 2026 / 02:42 PM IST

ప్రజలు స్వచ్ఛందంగా జనగణనలో పాల్గొనాలి: కమిషనర్

NLR: కావలిలో జనగణనపై అవగాహన కల్పించేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా జనగణనలో పాల్గొనాలని కోరారు. కచ్చితమైన సమాచారం ఇస్తే ప్రభుత్వ పథకాలు అందజేయడానికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

April 26, 2026 / 02:37 PM IST

దళితుల సంక్షేమానికి పోరాడాలి: RS ప్రవీణ్

KRNL: సామూహిక వివాహాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఆదివారం ఆలూరులో దళిత నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లాలో దళితుల సంక్షేమానికి పోరాడాలని నేతలకు సూచించారు. అనంతరం అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా ఈరన్న క్యాంప్లో జరుగుతున్న సామూహిక వివాహాలకు హాజరయ్యారు.

April 26, 2026 / 02:33 PM IST

పెట్రోల్ బంకులు తనిఖీ చేసిన ఆర్డీవో

కోనసీమ: పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు, రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొత్తపేట ఆర్డిఓ జి. మమ్మీ కొత్తపేటలోని పెట్రోల్ బంకులను ఆదివారం తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉన్న నిల్వలను బట్టి అందరికీ సమానంగా విక్రయించాలన్నారు.

April 26, 2026 / 02:33 PM IST

‘ఇంధన కొరత సృష్టిస్తున్న వారిపై చర్యలుతీసుకోవాలి’

KDP: ఇంధన కొరత సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నగర కార్యదర్శి డిమాండ్ చేశారు. ఆదివారం కడప పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కడప నగరంలో 234 పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ కొన్ని మూసివేయడం వల్ల సమస్య తలెత్తిందన్నారు. జేసీ చేసిన ప్రకటనకు భిన్నంగా వాస్తవ పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రభుత్వం ఇంధన కొరత నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

April 26, 2026 / 02:31 PM IST

‘లేబర్ కోడ్లు రద్దు చేసేంతవరకు పోరాడుతాం’

ELR: దేశంలోని కార్మిక వర్గాన్ని 140 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులకు నెట్టి వేసేందుకు తెచ్చిన 4 లేబరు కోడ్లను రద్దు చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణ డిమాండ్ చేశారు. ఆదివారం జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ వద్ద ముద్రించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. పిఎఫ్, ఈఎస్సై, గ్రాట్యూటీ వంటి పథకాలు పొందడానికి ఇవి అడ్డుపడయతన్నారు.

April 26, 2026 / 02:30 PM IST

జాతీయ రహదారి పక్కన మట్టికుప్పలు

CTR: పుంగనూరులో జాతీయ రహదారికి రోడ్డుకు ఇరువైపులా మట్టి కుప్పలు దర్శనమిస్తున్నాయి. నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. గృహాలను కూల్చి వేసినప్పుడు ఆ వ్యర్థాలను పలమనేరు రోడ్డు ఓం శక్తి ఆలయం వద్ద నుంచి తోపుమట్టం వరకు డంపింగ్ చేస్తున్నారు. వాహనదారులు కాస్త ఏమరపాటులో ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

April 26, 2026 / 02:29 PM IST

పెద్దాపురంలో ఘనంగా వాసవి మాత జయంతి

KKD: పెద్దాపురం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. సుప్రభాత సేవ, గ్రామోత్సవం, పల్లకి సేవతో పాటు 108 కన్యలతో ఊరేగింపు ఘనంగా సాగింది. మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు, పైడా సత్య రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

April 26, 2026 / 02:28 PM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన చల్లా శ్రీలక్ష్మి

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని రాంకో సిమెంట్ కళ్యాణ మండపంలో ఇవాళ మీర్జాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి కుమార్తె అఖిల నవీన్ కుమార్ రెడ్డి వివాహ వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకలలో దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించారు.

April 26, 2026 / 02:27 PM IST

ఇంధనంపై టెన్షన్ అవసరం లేదు: మంత్రి

GNTR: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సరఫరాలో చిన్న అంతరాయాల వల్లే కొన్ని బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ మార్కెటింగ్‌పై చర్యలు, రైతులకు ప్రత్యేక ఏర్పాట్లు, ప్రజలు అవసరమైనంత మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.

April 26, 2026 / 02:27 PM IST

మంత్రి సవితను కలిసిన కురుబ సంఘం నేతలు

SS: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను సత్యసాయి జిల్లా కురుబ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో కురుబ సంఘం బలోపేతానికి సభ్యులు చురుగ్గా కృషి చేయాలని మంత్రి సూచించారు. సంఘం అభివృద్ధికి, కులస్తుల సంక్షేమానికి తమ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.

April 26, 2026 / 02:26 PM IST

పెట్రోల్/ డీజిల్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

E.G: జిల్లాలో పెట్రోల్/ డీజిల్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జేసి మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. డీజిల్ / పెట్రోల్ కొరతపై హెల్ప్‌లైన్ నెంబర్ 8074661259 ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇంధన స్టాక్ సమస్యలు ఎదుర్కొంటున్న డీలర్లు 1967 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. అధికారులు సమస్యలపై స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

April 26, 2026 / 02:26 PM IST

ఆదోనిలో పర్యటించిన ఎమ్మెల్యే

KRNL: ఆదోనిలో ఆదివారం ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పర్యటించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుని స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

April 26, 2026 / 02:21 PM IST

రామాలయ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్

W.G: ఆకివీడు పెదపేటలో రామాలయ నిర్మాణానికి మే 3న ఉదయం 7:14 గంటలకు శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేసినట్లు ఉండి MLA రఘురామరాజు తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడారు. ఆలయ నిర్మాణంలో భాగంగా ఆదివారం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి, విగ్రహాలను సురక్షితంగా వేరే చోటుకు తరలించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే భవ్యమైన ఆలయ నిర్మాణం చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

April 26, 2026 / 02:17 PM IST

అంగన్వాడీ కేంద్రానికి నీటి కష్టాలు

PPM: భామిని మండలం నులకజోడులో అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్న చేతి బోరు మూడు నెలలుగా పనిచేయకుండా నిలిచిపోయింది. మరమ్మతులు చేపట్టకపోవడంతో చిన్నారులు, స్థానికులు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోరును తక్షణం మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలని అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.

April 26, 2026 / 02:15 PM IST