W.G: ఆకివీడు పెదపేటలో రామాలయ నిర్మాణానికి మే 3న ఉదయం 7:14 గంటలకు శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేసినట్లు ఉండి MLA రఘురామరాజు తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్లో మాట్లాడారు. ఆలయ నిర్మాణంలో భాగంగా ఆదివారం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి, విగ్రహాలను సురక్షితంగా వేరే చోటుకు తరలించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే భవ్యమైన ఆలయ నిర్మాణం చేపడతామని ఆయన స్పష్టం చేశారు.