• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ బదిలీ

సత్యసాయి: పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో జి.శ్రీనివాస్‌ను కొత్త కమిషనర్‌గా నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన కమిషనర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

April 16, 2026 / 08:20 PM IST

‘అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాలి’

ASR: అరకులోయ తహసీల్దార్ కార్యాలయాన్ని ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరాం గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించి, అర్హులైన గిరిజనులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కుమారస్వామికి సూచించారు. 

April 16, 2026 / 08:15 PM IST

జనగణనలో భాగస్వాములుకండి: ఎమ్మెల్యే

PLD: వెల్దుర్తి, జనాభా గణన-2027లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు. గురువారం క్యాంపు కార్యాలయంలో స్వయం నమోదు ప్రక్రియలో తన వివరాలు నమోదు చేశారు. ఏప్రిల్ 17–30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో మొబైల్ ద్వారా 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలని సూచించారు. దీంతో సంక్షేమం పారదర్శకంగా అందుతుందని చెప్పుకొచ్చారు.

April 16, 2026 / 08:15 PM IST

సింహాచలం చందనోత్సవానికి ప్రత్యేక బస్సులు

VSP: సింహాచలం చందనోత్సవం నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు విస్తృతంగా ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. రీజినల్ మేనేజర్ సి.బి. అప్పలనాయుడు ఆధ్వర్యంలో కొండపై ఏర్పాట్లను పరిశీలిస్తూ ట్రాఫిక్, రద్దీ నిర్వహణపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  చందనోత్సవానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఇందులో కలెక్టర్, పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.

April 16, 2026 / 08:14 PM IST

‘రీ-సర్వే సమస్యల పరిష్కారమే లక్ష్యం’

SKLM: రీ-సర్వేలో వచ్చిన సమస్యల పరిష్కారమే ధ్యేయం అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన జలుమూరు మండలం అక్కురాడ పంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో రీ-సర్వే పురోగతి, రికార్డుల నమోదు పై క్షేత్రస్థాయిలో ఆయన సమీక్షించారు. ఇందులో RDO ప్రత్యూష, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

April 16, 2026 / 08:13 PM IST

కచ్చలపాలెంలో దోమల మందు పిచికారి

AKP: కసింకోట మండలం తాళ్లపాలెం పీహెచ్‌సీ పరిధిలోని కచ్చలపాలెంలో గురువారం 100 ఇళ్లకు దోమల నివారణకు ఏసీఎం 5 శాతం దోమల మందు పిచికారి చేశారు. వైద్యాధికారులు డాక్టర్ రామ్, డాక్టర్ సుమ ఆధ్వర్యంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్ స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

April 16, 2026 / 08:11 PM IST

48 గంటల్లో మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

CTR: 48 గంటల్లో బాలికల మిక్సింగ్ కేసును చేధించినట్లు చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర గురువారం తెలిపారు. చిత్తూరు కొంగారెడ్డి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు ఈనెల 14 నుంచి కనిపించడం లేదని కేసు నమోదు అయింది. సాంకేతిక పరిజ్ఞానంతో ఒంగోలు, గుంటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నట్టు గుర్తించి, వారిని సురక్షితంగా తీసుకువచ్చి అప్పగించినట్టు ఆయన చెప్పారు.

April 16, 2026 / 08:10 PM IST

కర్నూలు మున్సిపల్ కమిషనర్ బదిలీ

KRNL: కర్నూలు మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్‌ను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో చల్లా ఓబులేసును నియమిస్తూ జీవో 414 విడుదలైంది. తొమ్మిది నెలలుగా సేవలు అందించిన విశ్వనాథ్ నగర అభివృద్ధికి కృషి చేశారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించారు.

April 16, 2026 / 08:10 PM IST

‘విద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయిస్తే చర్యలు’

VZM: విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఇవాళ హెచ్చరించారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో జిల్లా వ్యాప్తంగా పాన్ షాపులు, కిరాణ దుకాణాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 347 కేసులు నమోదు చేశామన్నారు.

April 16, 2026 / 08:06 PM IST

జిల్లా యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా గజేంద్ర

నంద్యాల జిల్లా వైసీపీ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా డోన్ పట్టణానికి చెందిన గజేంద్ర నాథ్ రెడ్డి నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని ఇచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి , మాజీ ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్ర నాథ్ రెడ్డికి గజేంద్ర ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

April 16, 2026 / 08:05 PM IST

గ్రీన్ ఫీల్డ్ హైవేపై రోడ్డు ప్రమాదం

ELR: చింతలపూడి మండలం రేచర్ల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం నుంచి సత్తుపల్లి బండిపై వెళ్తున్న వ్యక్తిని వెనక నుంచి అతివేగంతో వచ్చి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 16, 2026 / 08:04 PM IST

బహిరంగ మద్యపానం, గంజాయిపై స్పెషల్ డ్రైవ్స్

KDP: జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, బహిరంగ మద్యపానం, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిక ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై ప్రత్యేక నిఘా ఉంచి దాడులు నిర్వహించాలని సూచించారు.

April 16, 2026 / 08:01 PM IST

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం

అన్నమయ్య: ప్రజల భద్రతను లక్ష్యంగా పెట్టుకుని జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు గ్రామాల్లో పర్యటించి సైబర్ నేరాలు, మహిళా భద్రతపై ప్రజలకు వివరించారు. అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై తనిఖీలు నిర్వహించి ఈ-చలాన్లు విధించారు. ప్రజలు చట్టాలను పాటించి భద్రతకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

April 16, 2026 / 08:00 PM IST

వార్షిక ఫైరింగ్ సాధనలో పాల్గొన్న ఎస్పీ జగదీష్

ATP: అనంతపురం మండలం ఇటుకలపల్లి సమీపంలోని మన్నీల రేంజ్‌లో గురువారం నిర్వహించిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్‌లో జిల్లా ఎస్పీ పి.జగదీష్ పాల్గొన్నారు. ఏకే 47, గ్లాక్ పిస్టల్ సహా నాలుగు రకాల ఆయుధాలతో ఆయన ఫైరింగ్ సాధన చేశారు. అత్యవసర సమయాల్లో ప్రజల రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.

April 16, 2026 / 08:00 PM IST

నారీ శక్తి వందన్ విజయోత్సవ ర్యాలీ

 VZM: జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘నారీ శక్తి వందన్ అధినియం’ ఆమోదం పొందిన సందర్భంగా భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక కోట జంక్షన్ నుండి గంటస్తంభం వరకు సాగిన ఈ ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

April 16, 2026 / 07:54 PM IST