PPM: రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బి. సి.జనార్ధనరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రతో కలిసి బలిజిపేట మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు.
ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన వారపు సంత ద్వారా మొత్తం రూ. 3,98,200 ఆదాయం సమకూరింది. ఇందులో గొర్రెలు, మేకల సంత నుంచి రూ. 2,49,300 లభించగా, పశువుల సంత నుంచి రూ. 1,48,900 రాబడి వచ్చినట్లు యార్డు ఇంఛార్జ్ కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు తరలివచ్చనట్లు ఆయన పేర్కొన్నారు.
కాకినాడ: పెద్దాపురంలో తొమ్మిదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పట్టణానికి చెందిన 30 ఏళ్ల యువకుడిపై ఆదివారం పోక్సో కేసు నమోదైంది. బాలిక బయట ఆడుతుండగా.. చేయిపట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడని, బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: వల్లూరు మండల పరిధిలోని పుష్పగిరి క్షేత్రం వద్ద నది ప్రమాదాలకు నిలయంగా మారిన అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ప్రాంతంలో ఇప్పటికే ఎందరో మృత్యువాత పడ్డారని ప్రజలు తెలుపుతున్నారు. ఆ ప్రాంతంలో ఒక సూచిక బోర్డు ఏర్పాటు చేసి ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఎన్నికల ఖర్చుపై వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుని విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డికి ఇటీవల సూచించింది. ఎమ్మెల్యేకు చెందిన సంస్థ ఉద్యోగుల ఖాతాల్లో అదనంగా నగదు జమ చేసి తిరిగి తీసుకుని ఎన్నికల ఖర్చుకు వినియోగించారని ఓ మాజీ ఉద్యోగి ఆమె పై ఫిర్యాదు చేశారు.
TPT: త్వరలో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఓ జంట వేరువేరు చోట్ల సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. కడప(D) సుండుపల్లి(M)నికి చెందిన అనిషా (18), అస్లాంకు ఏడాది కిందట.. ఈ జూన్‌లో పెళ్లి ఖాయం అయింది. అయితే భాగంపల్లెలో అనిషా ఉరి వేసుకుని చనిపోగా.. చంద్రగిరి పరిధిలో అస్లాం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మృతికి గల కారణం తెలియాల్సి ఉంది.
W.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన భీమవరం ఎంపీడీవో కార్యాలయంలో భారీ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీ, కియా మోటార్స్, బాటా ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు గల యువతీ, యువకులు అర్హులని పేర్కొన్నారు.
చిత్తూరు: కుప్పం టీడీపీలో కోఆర్డినేషన్ కనిపించడం లేదని, ఎవరికి వాళ్లు గ్రూపులు కట్టుకుని పోతున్నారని CM చంద్రబాబు పలువురు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో తన PAగా ఉన్న మనోహర్ 6 ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని అప్పుడు కోఆర్డినేషన్ సమస్య ఏనాడూ రాలేదని, కుప్పం తన నియోజకవర్గమనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పనిచేయాలని CM హెచ్చరించినట్లు సమాచారం.
కడప జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖకు రూ.195.21 కోట్లు ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. జిల్లాలో రవాణా శాఖకు కడపలో డీటీసీ, ప్రొద్దుటూరులో ఆర్టీవో ,పులివెందుల, బద్వేల్, రాజంపేటలో MVI కార్యాలయాలు ఉన్నాయి. వీటి నుంచి లైఫ్ టాక్స్ రూపంలో రూ.168.22 కోట్లు, ఫీజుల ద్వారా రూ.16 కోట్లు,పెనాల్టీల ద్వారా రూ.6.70 కోట్లు, యూజర్ ఛార్జీల ద్వారా రూ.4 కోట్లు ఆదాయం లభించింది.
KKD: ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతీక రాజధాని అమరావతి అని, రాష్ట్ర అభివృద్ధికి రాజధాని అమరావతి కేంద్ర బిందువుగా నిలుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాకినాడ కూటమి శ్రేణులు తమ ఇళ్ల ముందు మన రాజధాని మన అమరావతి అని రంగవల్లికలతో ముగ్గులు వేశారు.
VZM: యువత మత్తుపదార్దాలకు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని రూరల్ సీఐ లక్ష్మణరావు సూచించారు. ఆదివారం సాయంత్రం స్దానిక వీటీ ఆగ్రహరం వై జంక్షన్ ప్రాంతంలో యువతకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. IPL జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగులు ఆడరాదని, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
బాపట్ల పట్టణం ఇమ్మడిశెట్టివారి పాలెంకు చెందిన ఇమ్మడిశెట్టి యలమందరావు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. హైకోర్టు నిర్వహించిన పరీక్షల్లో ఆయన ఈ ఘనత సాధించారు. తొలి ప్రయత్నంలోనే ఈ విజయం సాధించడం విశేషం. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన సీనియర్ న్యాయవాది పులిపాక రఘురాం వద్ద పనిచేశారు. పట్టుదలతో చదివి జడ్జిగా ఎంపికైన ఆయన యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తారని కలెక్టర్ రాజకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు అర్జీలను ప్రత్యక్షంగా లేదా meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్లో సమర్పించవచ్చన్ని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ 1100 ద్వారా పరిష్కార స్థితి తెలుసుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు.
PPM: జిల్లాలో త్వరలో డోలి యాత్ర ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి ఆదివారం డోలి రోడ్లపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో డోలి రోడ్లను మంజూరు చేశామని తెలిపారు.
CTR: చిత్తూరు నగరంలోని వన్ టౌన్ పక్కన్న ఉన్న ఆర్ముడ్ రిజర్వు కార్యాలయంలో ఇవాళ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి ప్రజలు ఫిర్యాదులు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు సకాలంలో కార్యాలయానికి చేరుకోవాలని తెలిపారు.