KRNL: మహాత్మ జ్యోతిబా ఫూలే సామాజిక సమానత్వానికి పునాది వేసిన మహనీయుడని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ పేర్కొన్నారు. ఫూలే 199వ జయంతి సందర్భంగా శనివారం ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది ఎం. రామన్న, జె. హనుమంతు ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలిసి పని ప్రదేశంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్థానిక ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహానుభావుడు జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అని కొనియాడారు.
ప్రకాశం: మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం చెన్నకేశవస్వామి గజవాహనంపై సార్వభౌమాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని ఉత్సవపీఠంపై ప్రతిష్ఠించి అర్చన, నివేదన, మంగళహారతి నిర్వహించారు. అనంతరం స్వామివారికి మాడవీధు గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు.
SKLM: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్రకమిటీ సభ్యులు, జిల్లా సాయుధరైతాంగ పోరాటయోధుడు కామ్రేడ్ పైలా వాసుదేవరావు 16వ వర్ధంతి కార్యక్రమం శ్రీకాకుళం మండలం తంగివానిపేటలో ఇవాళ నిర్వహించారు. IFTU జిల్లా నాయకురాలు కామ్రేడ్ సవలాపురపు కృష్ణవేణి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రైతాంగం కోసం ఆయన చేసిన పోరాటం ఎనలేనిదని అన్నారు.
గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ఎస్పీ వకుల్ జిందాల్ ‘ఎస్పీ సంపర్క్’ పేరుతో కొత్త వ్యవస్థను ప్రారంభించారు. కానిస్టేబులరీ స్థాయి సిబ్బంది తమ సమస్యలను నేరుగా తెలియజేసేందుకు ఈ సేవ ఉపయోగపడుతుందని ఎస్పీ తెలిపారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు 8688831470 నంబర్‌లో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
KDP: పొద్దుటూరు ASP విభుకృష్ణ ఆధ్వర్యంలో నేరాల కట్టడికి ఇక్కడి పోలీసులు దూకుడు పెంచారు. సబ్ డివిజన్‌లోని Clలు, SIలు శనివారం ఉదయం స్థానిక 1- టౌన్ స్టేషన్ పరిధిలో ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. రౌడీ, సస్పెక్ట్ షీటర్స్ ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి కదలికల వివరాలను నమోదు చేసుకున్నారు. సరైన పత్రాలులేని 92 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
KDP: చెన్నూరులో గంజాయి, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. లక్ష్మీనగర్, దౌలతాపురం, జగనన్న కాలనీల్లో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేశారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రకాశం: తాళ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివరామపురం గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం స్కూలు బస్సును ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి కర్రపాటివారిపాలెంకు చెందిన ఆంజనేయులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
GNTR: జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం గడువును పొడిగించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు క్యాష్‌లెస్ చికిత్స కొనసాగుతుంది. ఈహెచ్‌ఎస్ ప్రమాణాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అందించనున్నారు.
NDL: బనగానపల్లెలో బాలికపై జరిగిన అత్యాచారయత్నం సభ్య సమాజం తలదించుకునే అనాగరిక చర్య అని మంత్రి బి.సి.జనార్దన్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని, బాలికకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు.
CTR: మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతిని చిత్తూరులో ఇవాళ ఘనంగా నిర్వహించారు. పీసీఆర్ సర్కిల్ ఆయన విగ్రహానికి జేసీ ఆదర్శ రాజేంద్రన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆయన బలంగా విశ్వసించారని తెలియజేశారు.
ASR: పాడేరు నూతనంగా ఐటీడీఏ పీవోగా ఆదిత్య వర్మ ఇవాళ ఉదయం పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ముందుగా తన సతీమణి, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీపూజతో కలిసి ఆయన మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాధ్యతలను స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. ఐటీడీఏ ద్వారా గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు.
TPT: బడుగు బలహీన వర్గాల దార్శనికుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఘనంగా జరిగాయి. బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఫూలే విగ్రహానికి నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల కోసం, మహిళా విద్య కోసం ఆయన చేసిన పోరాటం దేశానికే మార్గదర్శకమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని కోరారు.
BPT: అద్దంకిలో బెదిరించి నగదు, బంగారం, మొబైల్ అపహరించిన కేసులో ఒంగోలుకు చెందిన సుబ్రహ్మణ్యంను శింగరకొండ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌తో పాటు 14 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఇద్దరు బాలురను జువెనైల్ కోర్డులో హాజరు పరచనున్నారు.
CTR: పెనుమూరు మండలంలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన పులిగుండు అభివృద్ధికి 79 ఎకరాలు ఏపీ టూరిజానికి కేటాయిస్తూ ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ అనేక సినిమా షూటింగ్‌లు, 1000 అడుగుల ఎత్తయిన రెండు రాతి కొండలు చూడ ముచ్చటగా ఉంటాయి. గత ఏడాది ఇక్కడ యోగ డేను జిల్లా అధికారులు నిర్వహించారు. ఆ ఫోటోలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన Xలో పోస్ట్ కూడా చేసుకున్నారు.