• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘బేబీ కిట్లు అందుబాటులో ఉన్నాయి’

PPM: బేబీ కిట్లు మంజూరు కోసం అధికారులకు నివేదికలు సమర్పించామని, త్వరలోనే కిట్లు అందిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా: ఎస్.భాస్కర రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న ఓ పత్రికలో వచ్చిన వార్తకు ఆయన స్పందించారు. మన్యం జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు బేబీ కిట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

April 20, 2026 / 08:14 PM IST

‘జిల్లా పేరును మారుమ్రోగడం గొప్ప విశేషం’

PPM: జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థిని ప్రణీత జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా పేరును జాతీయ స్థాయిలో మారుమ్రోగేలా చేసిందని కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి అన్నారు. పదోతరగతి చదువుతున్న ఈ క్రీడాకారిణి అండర్ 17 విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్స్ చేరుకోవడం అద్భుత విశేషం అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు.

April 20, 2026 / 08:13 PM IST

‘పాలిసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదేశాల మేరకు ఈనెల 25న జరిగే పాలిసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, విద్యుత్, త్రాగునీరు, వైద్య, రవాణా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. మార్కాపురం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.

April 20, 2026 / 08:13 PM IST

ఏయూ శతాబ్ది ఉత్సవాలపై సమీక్ష

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేదిక, పార్కింగ్, గ్రీన్‌రూమ్‌లు, గ్యాలరీల ఏర్పాట్లపై చర్చించి, ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అధికారులు తమ పనులకు గడువులు నిర్ణయించి సమయానికి పూర్తి చేయాలని, రోజువారీ పురోగతిని సమీక్షించాలన్నారు.

April 20, 2026 / 08:12 PM IST

‘జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి’

VZM: ఎస్పీ దామోదర్ ఆదేశాలతో కొత్తవలస పరిధిలో ‘అభ్యుదయం 2.0’ కార్యక్రమం సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో జరిగింది. జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నాట్లు పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అధికారులు కోరారు.

April 20, 2026 / 08:11 PM IST

పామర్రులో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ కార్యక్రమం

కృష్ణా: పామర్రు టీడీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కొమరవోలుకి చెందిన బేబీ ఆఫ్ కోవలి శృతికి రూ.90,306ల విలువైన చెక్కును MLA వర్ల కుమార్ రాజా అందించారు. ప్రజల అవసరాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తామని MLA తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 20, 2026 / 08:09 PM IST

‘అగ్నిమాపక శాఖ పాత్ర ఎంతో కీలకం’

SKLM: అగ్ని ప్రమాదాల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో అగ్నిమాపక శాఖ పాత్ర ఎంతో కీలకం అని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ బాబు అన్నారు. ఈ మేరకు సోమవారం సోంపేట అగ్గి మాపక కేంద్రం నూతన వాహనాన్ని ఆయన ప్రారంభించారు. అగ్నిమాపక కేంద్రంలో నూతన పరికరాలను ఎమ్మెల్యే పరిశీలించారు.

April 20, 2026 / 08:02 PM IST

జనగణన-2027 స్వీయ గణన పూర్తి చేసిన ఎమ్మెల్యే

CTR: జనగణన 2027లో భాగంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్వీయ గణన పూర్తి చేశారు. బీవీ రెడ్డి కాలనీలోని తన నివాసంలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా గృహ వివరాలను నమోదు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా జనగణనలో భాగస్వాములు కావాలని, ఏప్రిల్ 16 నుంచి 30 వరకు స్వీయ నమోదు అవకాశం ఉందని తెలిపారు. మే 1 నుంచి అధికారుల ద్వారా మొదటి దఫా గణన ప్రారంభమవుతుందని చెప్పారు.

April 20, 2026 / 08:00 PM IST

గ్రామాల్లో చెత్త నిర్వహణపై బీజేపీ వినతి

TPT: జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలు పీజీఆర్‌ఎస్‌లో జిల్లా డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. గ్రామాల్లో తడి & పొడి చెత్తా సేకరణ, కంపోస్ట్ యూనిట్లు సరిగా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పనిచేయని కంపోస్ట్ యూనిట్ల పునరుద్ధరణ, చెత్త వర్గీకరణ కఠినంగా అమలు, పారిశుధ్య కార్మికుల నియామకం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

April 20, 2026 / 08:00 PM IST

PGRSలో 257 అర్జీలు స్వీకరణ: కలెక్టర్

ELR: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పోటీతత్వంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి అర్జీని చాలెంజీగా తీసుకుని నిర్ణీత సమయంలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అలాగే ఈరోజు జరిగిన పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్లలో 257 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు.

April 20, 2026 / 07:56 PM IST

చిలకలూరిపేటలో వ్యభిచార గృహంపై దాడి

PLD: చిలకలూరిపేటలోని NRT సెంటర్ సమీపంలో గల సరళ నర్సింగ్ హోమ్ వీధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ముందస్తు సమాచారంతో, సోమవారం సాయంత్రం అర్బన్ సీఐ రమేష్ తన సిబ్బందితో కలిసి ఓ ఇంటిపై దాడి నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

April 20, 2026 / 07:53 PM IST

బాలుర పర్యవేక్షణ గృహాన్ని పరిశీలించిన అధికారి

తూ.గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని సోమవారం సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. పర్యవేక్షణ గృహంలో ఉన్న బాలురతో మాట్లాడి వారి బాగోగులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలురకు ఆమె పలు సూచనలు చేశారు. వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని, విద్యపై దృష్టి సారించాలన్నారు.

April 20, 2026 / 07:50 PM IST

బాలుడి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

ATP: పామురాయి సమీపంలో జరిగిన మైనర్ బాలుడి హత్య కేసును అనంతపురం రూరల్ పోలీసులు 48 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. రజక కాలనీకి చెందిన కళ్యాణ్ సాత్విక్ అనే బాలుడిని, రామమోహన్ సిమెంట్ పెల్లలతో తలపై కొట్టి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. తన భార్యతో బాలుడు సన్నిహితంగా ఉన్నాడనే అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

April 20, 2026 / 07:50 PM IST

కలెక్టర్‌ను కలిసిన ఎక్సైజ్ అధికారి

W.G: జిల్లా కలెక్టర్ నాగరాణిని భీమవరం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నూతనంగా విధుల్లో జాయిన్ అయిన జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి బి.సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిశారు. అక్రమ మద్యం రవాణా అరికట్టడానికి కృషి చేయాలని, మద్యం షాపులు నిర్వహణను నిబంధనల మేరకు నిర్వహించేలా చూడాలని ఆదేశించారు.

April 20, 2026 / 07:49 PM IST

‘ప్రభుత్వ బడులలో విద్యార్థులను చేర్పిద్దాం’

KRNL: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లో అన్ని వసతులు ఉన్నాయని, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ చేసుకోవాలని UTF జిల్లా అధ్యక్షులు రవికుమార్, KDCC దానమయ్య ఛైర్మన్ పేర్కొన్నారు. ఇవాళ గూడూరు పట్టణంలో ‘ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం’ కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలన్నారు.

April 20, 2026 / 07:49 PM IST