PLD: సత్తెనపల్లి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అన్న క్యాంటీన్లకు విరాళాలు అందించగా, మహిళలకు చీరలు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు పట్టణ పోలీసులు ‘అభ్యుదయం 2.0’ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే 100 రోజుల్లో జిల్లాను పూర్తిస్థాయిలో డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని పోలీసులు తెలిపారు.
TPT: పుత్తూరు పట్టణంలో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎస్సైలు నాగేంద్రబాబు, వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. గంజాయి, జూదం, బెట్టింగ్, దొంగతనాలు వంటి అసాంఘిక కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టినట్లు తెలిపారు. బస్టాండ్, స్కూల్స్, కాలేజీలు, పార్కుల వద్ద పర్యవేక్షణ పెంచారు.
W.G: కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని సోమవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. డిప్యూటీ సీఎం పేరిట నకిలీ సిఫార్సు లేఖలు సృష్టిస్తూ, దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో దళారులు చేసే మోసపూరిత వాగ్దానాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని కలెక్టర్ హెచ్చరించారు.
W.G: భీమవరం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థాన రథశాలకు MLA పులపర్తి రామాంజనేయులు సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రతి ఏటా శివరాత్రికి జరిగే రథోత్సవానికి చిహ్నమైన రథానికి ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, మెంటే పార్ధసారధి, ఆలయ EO, కూటమి నాయకులు పాల్గొన్నారు.
జిల్లాలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ముద్దనూరు సీఐ నగేష్ చింతకుంట గ్రామంలో మహిళలకు అవగాహన కల్పించారు. శక్తి యాప్ వినియోగం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లపై వివరాలు తెలియజేస్తూ, సైబర్ నేరాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శక్తి యాప్ వినియోగం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో 10 నిమిషాల్లో పోలీస్ సహాయం అందుతుందన్నారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. మూడు నెలలకు మొత్తం రూ. 4,25,258 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్. లక్ష్మీబాయి, ఛైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్నదొర, ధర్మకర్తల మండలి సభ్యులు, బ్యాంక్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
NTR: కంచికచర్ల ఫైర్ స్టేషన్‌లో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఓ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ అధికారి శివారెడ్డి పాల్గొని అగ్ని ప్రమాదాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రమాదం సంభవించినప్పుడు తక్షణమే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు.
మార్కాపురం మండలం గజ్జలకొండకు చెందిన నాసరయ్య థాయిలాండ్లో ప్రపంచ స్థాయి మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్‌లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించారు. 100 మీటర్ల పరుగులో గోల్డ్, 5000 మీటర్ల వాక్ రేస్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. తండ్రి మరణించిన ఆరు నెలల్లోనే థాయిలాండ్‌కు వెళ్లే అర్హత సాధించాడు. తన తండ్రిలేని లోటును తీర్చుకుంటూ తల్లి ప్రోత్సాహంతో థాయిలాండ్ చేరాడు.
PLD: నరసరావుపేట శ్రీనివాస్ నగర్ వృద్ధాశ్రమంలో సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు వృద్ధులను సందర్శించి అందించారు. వారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
VZM: జిల్లాకు ఐదు పశు ఔషది కేంద్రాలు మంజూరైనట్లు కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి, రామభద్రపురం, గజపతినగరాలలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా పశువులకు కావలసిన జనరిక్ మందులు తక్కువ ధరలకు రైతులకు అందించడం జరుగుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని పాడి రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.
శ్రీకాకుళం నగర ప్రజలు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్. కూర్మారావు అన్నారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వీయగణన ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతోందన్నారు. అలాగే, ప్రతీ ఇంటి నుండి జనగణన ఉండాలన్నారు.
NLR: రైతులు ఎకరాకు యూరియా 3 కట్టలు మాత్రమే వాడాలని MAO లక్ష్మి రైతులకు సూచించారు. సోమవారం విడవలూరు (m) ముదివర్తిలో అధిక మోతాదులో యూరియా వాడకం కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో ఒక ఎకరాకి 3 కట్టలు యూరియా కార్డుల ద్వారా మాత్రమే అందిస్తామన్నారు. రైతులు సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి పొందాలని తెలిపారు.
PLD: మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.5 కోట్లతో సిద్ధం చేసిన ప్రణాళికలను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనంద రెడ్డి పరిశీలించారు. ఆలయ నమూనాల పునర్నిర్మాణంపై అధికారులతో సమావేశమై చర్చించారు. దేవస్థానం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
CTR: జిల్లా అటవీ శాఖ అధికారి డా. సుబ్బరాజుని జనసేన నాయకులు యువరాజు స్వేరో, తేజో బూసినాయని ఈరోజు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల పరిరక్షణ, అభివృద్ధి అంశాలపై వారు చర్చించగా, డీఎఫ్‌వో సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు.