• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వనికి పోయిన గిరిజనం: భారీ పాము హతం!

ASR: గూడెంకొత్తవీధి మండలంలోని జర్రెల కొత్తూరు గ్రామంలో భారీ పాము సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. శనివారం రాత్రి సమీప అడవి నుంచి సుమారు 15 అడుగుల పొడవైన పాము గ్రామంలోకి ప్రవేశించింది. పాము ఓ ఇంట్లోకి దూరడంతో అక్కడి గిరిజనులు భయంతో పరుగులు తీశారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తమై సుమారు గంటన్నర పాటు శ్రమించి పామును హతమార్చినట్లు తెలిపారు.

April 12, 2026 / 07:46 AM IST

15 నుంచి గ్రామసభలు: MPDO

VZM: ఈ నెల 15 నుంచి 17 వరకు వంగరలోని 29 గ్రామ పంచాయతీలలో అభివృద్ధి ప్రణాళికపై గ్రామసభలు నిర్వహణకు సన్నాహకాలు చేస్తున్నట్లు డిప్యూటీ MPDO రామారావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టవలసిన పనులు, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, మహిళా శిశు సంరక్షణపై చర్చించనునట్లు తెలిపారు.

April 12, 2026 / 07:40 AM IST

విజయవాడలో గంజాయి ముఠా గుట్టురట్టు

ఎన్టీఆర్: వియజవాడలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. శనివారం సాయంత్రం శిఖామణి సెంటర్ సమీపంలో గంజాయి ఉందన్న సమాచారం మేరకు మాచవరం పోలీసులు మెరుపు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామన్నారు.

April 12, 2026 / 07:39 AM IST

కచ్చితత్వంతో జనగణనను నిర్వహించాలి: ఎమ్మెల్యే

PPM: జనగణనను కచ్చితత్వంతో నిర్వహించాలని కురుపాం MLA తోయక జగదీశ్వరీ సూచించారు. శనివారం గుమ్మలక్ష్మీపురం ZP హైస్కూల్‌లో MRO శేఖరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్యుమరేటర్స్‌ శిక్షణ తరగతులను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు అభివృద్ధికి ఎంతో కీలకమైన జనాభా గణనను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి సర్వే చేపట్టాలన్నారు.

April 12, 2026 / 07:35 AM IST

ఎయిర్‌ పోర్ట్ భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్

SKLM: పలాసలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం కోసం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తన కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. రైతులకు అవగాహన కల్పించి భూసేకరణ ప్రక్రియను సులభతరం చేయాలని అధికారులు సూచించారు. భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. SP మహేశ్వర రెడ్డి, JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉన్నారు.

April 12, 2026 / 07:31 AM IST

రూ.48 లక్షల మోసం.. నిందితుడు అరెస్ట్

NLR: నెల్లూరులో టీటీడీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 48 లక్షలు వసూలు చేసిన కేటుగాడు షేక్ హుస్సేను వేదాయపాలెం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.25.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ దీక్ష వెల్లడించారు. నకిలీ నియామక పత్రాలతో నిరుద్యోగులను నమ్మించి ఈ మోసానికి పాల్పడినట్లు, దళారులను నమ్మి మోసపోవద్దని ఏఎస్పీ తెలిపారు.

April 12, 2026 / 07:25 AM IST

జిల్లా న్యాయమూర్తులుగా ఇద్దరు జడ్జీలకు పదోన్నతి

SS: జిల్లాలోని హిందూపురం, కదిరి సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. హిందూపురం జడ్జి వెంకటేశ్వర్లు నాయక్, కదిరి జడ్జి జయలక్ష్మి జిల్లా న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు ఈ పదోన్నతులు కల్పించారు.

April 12, 2026 / 07:21 AM IST

నీటి సంరక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలన

E.G: భీమోలు గ్రామంలోని పెద్ద చెరువును, గంగోలు చెరువును జలదార విజిటింగ్ బృందం పరిశీలించింది. జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ, వర్షం నీటి సంరక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీటితో వ్యవసాయానికి నీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాల స్థాయిలు మెరుగుపడతాయని చెప్పారు. అదేవిధంగా డ్యాంలు,చెరువు గట్టు పటిష్టానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.

April 12, 2026 / 07:20 AM IST

ధర్మవరంలో ఆర్‌ఎంపీ డాక్టర్ హత్య

బాపట్ల: అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో అర్ధరాత్రి జరిగిన దాడిలో ఆర్‌ఎంపీ డాక్టర్ మేడగం కోటిరెడ్డి మృతి చెందారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

April 12, 2026 / 07:17 AM IST

భర్త మారడని మనస్తాపానికి గురై భార్య ఆత్మహత్య

KRNL: తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన సి.లలిత(28) భర్త శివ తాగుడకు బానిసై ఆర్థిక ఇబ్బందుల వల్ల భర్త మారడని మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నట్లు లలిత తల్లి రామలక్ష్మి తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు జొన్నగిరి ఎస్సై మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి కూతురు, కొడుకు ఉన్నారు.

April 12, 2026 / 07:15 AM IST

ఒంటిమిట్ట సీఐ బదిలీ

KDP: ఒంటిమిట్ట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐగా పనిచేస్తున్న పి.నరసింహరాజును కడప నగరం తాలుకా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ గతేడాది నవంబరు 12న బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా అయిదు నెలలకే స్థాన చలనం కల్పించారు. కడప నేర విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న శ్రీహరి ఒంటిమిట్టకు రానున్నారు.

April 12, 2026 / 07:12 AM IST

ట్రాక్టర్‌‌ పైనుంచి జారిపడి యువకుడు మృతి

VZM: ట్రాక్టర్‌పై నుంచి జారిపడి ఆడారి వంశీ(28) మృతి చెందినట్లు పట్టణ సీఐ కె.నారాయణరావు చెప్పారు. పార్వతీపురం మండలం కారాడ వలస నుంచి బొబ్బిలి మండలం డొంగురు వలస పెళ్లికి వెళ్లారన్నారు. అనంతరం ట్రాక్టర్‌పై తిరిగి వెళ్తుండగా మితిమీరిన వేగంతో ట్రాక్టర్ నడపడం వల్ల తొట్టెలో ఉన్న వంశీ జారిపడి తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

April 12, 2026 / 07:12 AM IST

నేడు జిల్లాలో మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

CTR: జిల్లాలోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఆరవ తరగతి ప్రవేశానికి ఇవాళ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇందుకోసం మొత్తం 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్దేశించిన సమయాన్ని కంటే అర్దగంట ముందుగా చేరుకోవాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

April 12, 2026 / 07:11 AM IST

‘అమరావతి పేరిట లక్షల కోట్ల దోపిడీ’

ATP: అమరావతి రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడుతోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడులో పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా ఎమ్మెల్యే పరిటాల సునీత అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

April 12, 2026 / 07:10 AM IST

సామర్లకోటలో చోటా గ్యాస్ సిలిండర్లు రెడీ

KKD: ప్రభుత్వాల ఆదేశాల మేరకు సామర్లకోటలో పేద ప్రజలు, వలస కూలీలకు చోటా సిలిండర్లను అందిస్తున్నట్లు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు శనివారం తెలిపారు. గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా కార్మికులు పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ప్రధాన గ్యాస్ కంపెనీలు ఐదు కేజీల సిలిండర్లు సరఫరా చేపట్టాయి. ఏదేని ఒక గుర్తింపు ఉంటే ఐదు కేజీల సిలిండర్‌ను అందిస్తామన్నారు.

April 12, 2026 / 07:10 AM IST