• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘జిల్లాలో జలధార సమర్థవంతంగా అమలు చేయాలి’

W.G: జిల్లాలో జలధార-జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలనీ అధికారులని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శనివారం అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అటవీ అధికారులు లంక, తీరప్రాంత గ్రామాలలో మడ అడవులు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

April 11, 2026 / 07:30 PM IST

‘ప్రకృతి వ్యవసాయం రైతుకు బంగారు భవిష్యత్తు’

KRNL: జిల్లాలో ప్రకృతి వ్యవసాయంతోనే రైతులకు బంగారం భవిష్యత్తు ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారిని లలితా వరలక్ష్మి అన్నారు. శనివారం ఉద్యాన సమావేశ మందిరంలో డీపీఎం మాధురి యాదవ్ కలిసి ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులందరికీ పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని, ప్రకృతి సాగు విస్తీర్ణం పెంచాలన్నారు.

April 11, 2026 / 07:30 PM IST

ఎమ్మెల్యే ఉదారత.. రిక్షా బండి అందజేత

NTR: విజయవాడ శ్రీనగర్ రెండవ లైన్‌కు చెందిన లక్ష్మి ఇంటింటికి తిరుగుతూ, వాటర్ క్యాన్స్ సరఫరా చేయడానికి అద్దె బండితో కిరాయి కట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి, రూ.35,000/ విలువచేసే రిక్షా బండిని లక్ష్మికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

April 11, 2026 / 07:29 PM IST

20 లక్షల సోలార్ రూప్ టాప్‌ల ఏర్పాటే లక్ష్యం: గొట్టిపాటి

మార్కాపురం: రాష్ట్రంలో 20 లక్షల సోలార్ రూప్ టాప్‌ల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శనివారం మార్కాపురం మండలం పెద్ద యాచవరంలో పీఎం సూర్య ఘర్ సోలార్ రూట్ టాప్ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

April 11, 2026 / 07:25 PM IST

ఆ ఘనత వైసీపీకే దక్కుతుంది: కాకాణి పూజిత

NLR: 31 లక్షల మంది అక్కాచెల్లెమ్మలను ఇంటి యజమానులను చేసిన ఘనత వైసీపీదేనని పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. నాడు జగనన్న రాజ్యంలో అమ్మ ఒడి, చేయూత వంటి పథకాలతో మహిళల ఇళ్లలో వెలుగులు నిండాయని, అయితే నేడు కూటమి పాలనలో మహిళల రక్షణ గాలికి వదిలేశారని విమర్శించారు. మాజీ సీఎం జగన్ మహిళా బిల్లుకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు.

April 11, 2026 / 07:20 PM IST

‘రేపు పలు వార్డుల్లో మంచినీటి సరఫరా బంద్’

GNTR: తెనాలి పురపాలక సంఘ పరిధిలో గాంధీ పార్కు ఓల్డ్ ట్యాంక్ వద్ద షట్టర్ లీక్ ఏర్పడిన కారణంగా ఆదివారం పలు వార్డుల్లో మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. 7వ వార్డుకు సగభాగం & 10,11 వార్డులకు పూర్తిగా మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. పట్టణ పరిధిలో 7, 10, 11 వార్డు ప్రజలు దీనిని గమనించాలని కోరారు.

April 11, 2026 / 07:19 PM IST

గుంతకల్లులో మైనర్ల తల్లిదండ్రులకు పోలీసుల కౌన్సెలింగ్

ATP: గుంతకల్లులో శనివారం ‘స్టాప్ మైనర్ డ్రైవింగ్’ కార్యక్రమం నిర్వహించారు. తనిఖీల్లో పట్టుబడిన 68 మంది మైనర్ల తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని, 18 ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.

April 11, 2026 / 07:10 PM IST

వేటపాలెం గర్ల్స్ హైస్కూల్లో పూలేకు ఘన నివాళులు

BPT: మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతిని వేటపాలెం జడ్పీ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. టీచర్స్, స్టూడెంట్స్ పూలతో ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వ సాధనకి కృషి చేసిన మహోన్నత వ్యక్తి పూలే అని ఇంఛార్జ్ హెచ్ఎం యూ.వేణుగోపాల్ కొనియాడారు. స్త్రీ విద్య, ఉన్నతి కోసం ఆయన చేసిన కృషిని టీచర్స్ కీర్తించారు.

April 11, 2026 / 07:09 PM IST

చదువే ఆయుధమని నమ్మిన మహానీయుడు పూలే: ఎమ్మెల్యే

కృష్ణా: పామర్రు టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చదువే సమాజం మార్పుకు ఏకైక ఆయుధమని నమ్మిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

April 11, 2026 / 07:02 PM IST

పూలే ఆశయాలను సాధిద్దాం: ఎమ్మెల్యే

KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమానీ ఘనంగా నిర్వహించారు. పూలే చిత్ర పటానికి పులా మాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంఘ సంస్కర్త, మహిళా విద్య, కుల నిర్మూలన కోసం పోరాడిన పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించారన్నారు. దళితులు, బడుగు బలహీన అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేశారని అన్నారు.

April 11, 2026 / 07:00 PM IST

కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఊంజల్ సేవ

TPT: శనివారం పురస్కరించుకుని తిరుపతి జిల్లా నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వాదాలు అందించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవను కళ్లారా తిలకించి తరించారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి.

April 11, 2026 / 07:00 PM IST

’13న యథావిధిగా పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్’

E.G: ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS & రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఏప్రిల్ 13న యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటారన్నారు.

April 11, 2026 / 07:00 PM IST

జ్యోతిరావు పూలే జయంతి వేడుకలో మాజీ ఎమ్మెల్యే

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూలే జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని మాజీ ఎమ్మెల్యే అన్నారు.

April 11, 2026 / 07:00 PM IST

ఖాజీపేట నిందితుడి కాలికి ఆసుపత్రిలో వైద్యం

KDP: ఖాజీపేటలో శుక్రవారం మైనర్ బాలికను వెంకటేశ్ అనే యువకుడు గొంతు కోసి హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు నిందితుడిని పట్టుకొని జైలుకు తరలిస్తున్న సమయంలో నిందితుడు పోలీసులపై తిరుగుబాటు చేసి పారిపోతున్న సమయంలో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతడి మోకాలి కింది భాగంలో ఎముక విరిగింది. దానికి నేడు రిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేసి వైద్యం అందించారు.

April 11, 2026 / 07:00 PM IST

ఆసుపత్రి ఎదుట వైద్యుల నిరసన

ELR: ఏలూరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు శనివారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన చేపట్టారు. సీ.పీ.స్ రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతిని అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న డీ.ఏలు, సరెండర్ లీవ్ జీతం మంజూరు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరికి 11వ పీ.ఆర్.సీ స్కేల్ ప్రకారం 100% గ్రాస్ జీతం అమలు చేయాలన్నారు.

April 11, 2026 / 07:00 PM IST