• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

స్థల వివాదంపై కేసు నమోదు

BPT: బల్లికురవ మండల పరిధిలోని కూకట్లపల్లి గ్రామంలో నివాస స్థల వివాదానికి సంబంధించి సోమవారం సాయంత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంజిరెడ్డి తన నివాస స్థలం విషయంలో వివాదం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన పేరి రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

April 28, 2026 / 06:29 AM IST

ఈనెల 30న పార్సిల్లు వేలం పాట

GNTR: ఆర్టీసీ బస్టాండు పార్సిల్ కార్యాలయంలోని పార్సిళ్లకు ఈ నెల 30న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరావత్తులు చెల్లించి, ఎవరైనా పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు. పూర్తి సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

April 28, 2026 / 06:29 AM IST

పోలీసుగా మోసం చేసి అత్యాచారం.. 10 ఏళ్ల జైలు

GNTR: పోలీసునని నటిస్తూ విద్యార్థినిని బెదిరించి అత్యాచారం చేసిన వ్యక్తిపై జిల్లా కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. గోపి అనే వ్యక్యికి 10 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.23 వేల జరిమానా విధించింది. ఇప్పటికే 29 కేసులు ఉన్న నిందితుడిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. బాధితురాలికి రూ.1లక్ష పరిహారం అందజేయాలని ఆదేశించింది.

April 28, 2026 / 06:24 AM IST

నకరికల్లు చెరువులో తాగునీటి నాణ్యత తనిఖీ

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో తాగునీటి సరఫరాపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నకరికల్లు చెరువులో నీటి నాణ్యతను ఎస్ఈ, కమిషనర్ రమ్య కీర్తన, డీఈ రఫీ పరిశీలించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

April 28, 2026 / 06:15 AM IST

నేటి నుంచి వేసవి శిక్షణ శిబిరాలు

చిత్తూరులోని సీఆర్ రెడ్డి కేంద్ర గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం ఇవాళ ప్రారంభంకానున్నట్లు ఉప గ్రంథాలయాధికారిణి లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో ఆటలు, పాటలు చదువు వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

April 28, 2026 / 06:13 AM IST

ఇంధన సరఫరాలో అక్రమాలు జరిగితే ఫోన్ చేయండి: కలెక్టర్

తూ.గో: రాజానగరంలోని ఐవోసీఎల్ పెట్రోల్ బంక్‌ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సరఫరాలో అక్రమాలు జరిగితే 8074661259 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ధరలు, కొలతలను పరిశీలించి, నిరంతర సరఫరాకు అధికారులను ఆదేశించారు.

April 28, 2026 / 06:13 AM IST

‘కీలక ఒప్పందాలు, ప్రముఖులకు సన్మానం’

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాతో సహకారం, ఓఎక్స్‌ఎంఐక్యూ తో రూ. 400 కోట్ల ఏఐ సెంటర్ ఏర్పాటు, మరియు ఐఐటీఎమ్ తో రూ. 180 కోట్ల వాతావరణ పరిశోధన ఒప్పందాలను వర్సిటీ కుదుర్చుకుంది. ఈ వేడుకల్లో భాగంగా ఎం. వెంకయ్య నాయుడు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ సహా పలువురు పూర్వ విద్యార్థులను వర్సిటీ సత్కరిచింది.

April 28, 2026 / 06:07 AM IST

ఎంపీ చొరవ.. దుబాయ్ నుంచి క్షేమంగా ఇంటికి

కాకినాడ: దుబాయ్‌లో ఉపాధి పొందుతూ యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకున్న పెద్దాపురం మండలం దివిలికి చెందిన సన్యాసిరావు ఎంపీ ఉదయ శ్రీనివాస్ చొరవతో సోమవారం స్వగ్రామం చేరుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రావడానికి ఇబ్బంది పడుతుండగా, ఎంపీ ఎంబసీ అధికారులతో మాట్లాడి స్వదేశానికి రప్పించారు. క్షేమంగా ఇంటికి చేరుకున్న సన్యాసిరావు కుటుంబం ఆనందం వ్యక్తం చేశారు.

April 28, 2026 / 06:07 AM IST

అర్జిదారుల సమస్యలు పరిష్కరించాలి: ఎస్పీ

తూ.గో: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ డి.నరసింహ కిషోర్ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. వాళ్లతో మాట్లాడి వారి సమస్యలను ఆలకించారు. సమస్య ఉన్నచోట్ల సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలన్నారు.

April 28, 2026 / 06:04 AM IST

హనీ ట్రాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

ATP: హనీ ట్రాప్ కేసులో కీలక సూత్రధారి, రుద్రంపేట మాజీ వైస్ సర్పంచ్ నరేంద్రరెడ్డి, ఓం ప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. రంగమ్మ, ఉమాదేవి గ్యాంగులతో సంబంధాలు నడుపుతూ బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో నరేంద్రరెడ్డిది కీలక పాత్ర అని పోలీసులు తెలిపారు.

April 28, 2026 / 06:04 AM IST

నేడు జల ధార.. జల హారతి కార్యక్రమం

ASR: చొంపి పంచాయతీ గెమ్మెలివలస గ్రామంలో మంగళవారం జలధార.. జలహారతి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నిశాంతి ముఖ్య అతిథిగా హాజరై పనులకు శ్రీకారం చుడతారని జిల్లా జలయాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.

April 28, 2026 / 06:02 AM IST

నేటి నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

NLR: వింజమూరు మండలంలోని నల్లగొండ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ లెక్కల కాంతారెడ్డి, కార్యనిర్వహణాధికారి బి.శాంతయ్య తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

April 28, 2026 / 06:02 AM IST

ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం

AKP: ఎస్ రాయవరం మండలం పెనుగొల్లులో శివాలయం నిర్మాణానికి అదే మండలం ధర్మవరం అగ్రహారం గ్రామానికి చెందిన వెదుళ్ళ బాబూరావు, సత్యవతి దంపతులు రూ. లక్ష విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆలయ కమిటీ సభ్యులు గోపాలకృష్ణ, వెంకటరత్నంకు నగదు అందజేశారు. దాతలు సహకారంతో ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

April 28, 2026 / 05:27 AM IST

నేడు పారిశుద్ధ్య కార్మికుల సమ్మె

ASR: వేతన బకాయిలు, సమస్యల పరిష్కారం కోరుతూ పెదలబుడు పంచాయతీ పారిశుధ్య కార్మికులు మంగళవారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు. అరకు లోయ మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట వారంతా నిరసన తెలపనున్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

April 28, 2026 / 04:29 AM IST

నేడు సింహాద్రి అప్పన్న సన్నిధికి చంద్రబాబు

VSP: విశాఖ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకోనున్నారని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ శంకుస్థాపన అనంతరం మధ్యాహ్నం సుమారు 12 గంటల తర్వాత సింహగిరికి వస్తారన్న సమాచారం ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

April 28, 2026 / 04:17 AM IST