• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

BPCL డిపోను పరిశీలించిన జేసీ

ATP: గుత్తిలోని కర్నూల్ రోడ్‌లో గల BPCL డిపోను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఇంఛార్జ్ తహసీల్దార్ సూర్యనారాయణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం డిపోలోని స్టాక్ వివరాలను పరిశీలించి డీజిల్, పెట్రోల్ ఎలా సరఫరా చేస్తున్నారో అనే దానిపై ఆరా తీశారు. డిపో 24/7 రన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫిల్లింగ్ డిపోను కూడా తనిఖీ చేశారు.

April 28, 2026 / 06:40 PM IST

నాగలాపురం మార్కెట్ కమిటీకి ఛైర్మన్‌గా జాన్సన్

TPT: సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఛైర్మన్‌గా జాన్సన్, వైస్ ఛైర్మన్‌గా మురళి నియమితులయ్యారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేయగా, పలువురు స్థానికులు సభ్యులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

April 28, 2026 / 06:40 PM IST

గుడిపాల పోలీసులకు వినతిపత్రం అందజేత

CTR: వి.కోట జర్నలిస్ట్ జగన్ మోహన్ రెడ్డి హత్యను గుడిపాల మండల జర్నలిస్టులు ఖండించారు. ఇదివరకు సాధారణ దాడులకు పాల్పడుతున్న కొంతమంది దుండగులు హత్యా రాజకీయానికి తెరలేపారని మండిపడ్డారు. హత్యకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుడిపాల ఏఎస్ఐ మునివేల్‌కు వినతి పత్రం సమర్పించారు.

April 28, 2026 / 06:39 PM IST

‘తాగునీరు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’

ప్రకాశం: ఒంగోలు రూరల్ మండలాలలో పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు, ప్రత్యేక అధికారులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులను పారదర్శకంగా వినియోగించాలని, త్రాగునీరు, పారిశుద్ధ్యం, మురుగుకాల్వలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో నిక్కచ్చితనం పాటించి ఆదాయ వనరులు పెంచాలన్నారు.

April 28, 2026 / 06:22 PM IST

పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి

మార్కాపురంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పిడుగుపాటుకు గురై బోడపాడు గ్రామ పొలాల్లో ఒంటేరు పోలమ్మ అనే మహిళ మృతి చెందింది. మరొక మహిళకు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈదురుగాలులకు బోడపాడులోని కోళ్ల ఫారం షెడ్డు కూలి చింతకుంట్ల కుమారి అనే మరో మహిళా మృతి చెందింది.

April 28, 2026 / 06:22 PM IST

సచివాలయాలలో శ్యామలాదేవి తనిఖీలు.!

GNTR: తెనాలి పట్టణంలోని పెరుగు మార్కెట్ 1, 2 సచివాలయాలను యస్‌వీడబ్ల్యూఎస్ మేనేజర్ శ్యామలాదేవి సందర్శించారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

April 28, 2026 / 06:22 PM IST

గుత్తి మండలంలో విషాదం

ATP: గుత్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బేతాపల్లి గ్రామంలో భోయగడ్డ శ్రీనివాసులు అనే వ్యక్తి తన ఇంటి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు తగిలి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు శ్రీనివాసులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

April 28, 2026 / 06:20 PM IST

జర్నలిస్టుల భద్రతపై ఆందోళన

TPT: వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ హత్యను నిరసిస్తూ తిరుపతిలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు కూన అజయ్ బాబు మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

April 28, 2026 / 06:14 PM IST

ఫేషియల్ విధానంపై గ్రామస్థుల నిరసన

ASR: ఉపాధి హామీ పథకంలో ఫేషియల్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని గిరిజన సంఘం డుంబ్రిగూడ మండలం అధ్యక్షుడు పాంగి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండలంలోని లోగిలి గ్రామంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఫేషియల్ విధానం వల్ల మారుమూల ప్రాంతాలలో గిరిజన శ్రామికులు అనేక అవస్థలు పడుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ విధానం వల్ల సమస్య తప్ప ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

April 28, 2026 / 06:11 PM IST

జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డికి నివాళులు అర్పించిన జడ్పీ ఛైర్మన్

CTR: వీకోటలో హత్యకు గురైన జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు మంగళవారం పరామర్శించారు. ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దోషులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.

April 28, 2026 / 06:08 PM IST

గంజాయి అమ్మే వారి సమాచారం తెలిపితే రూ.10 వేలు

మార్కాపురంలో గంజాయి నిర్మూలనకు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, సీఐ అల్తాఫ్ హుస్సేన్ గంజాయి సమాచారానికి రూ.10 వేల బహుమతి ప్రకటించారు. సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. యువత భవిష్యత్తు కోసం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 28, 2026 / 06:06 PM IST

గంగ జాతరకు పక్కా ఏర్పాట్లు: కమిషనర్

TPT: తిరుపతిలో నిర్వహించనున్న తాతయ్యగుంట గంగజాతరకు అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేసి విజయవంతం చేయాలని ఇంఛార్జ్ కమిషనర్ శారదా దేవి అధికారులకు ఆదేశించారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, మజ్జిగ పంపిణీ, సీసీ కెమెరాలు, మొబైల్ టాయిలెట్స్, అగ్నిమాపక చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో శుభ్రత, చెత్త తొలగించాలన్నారు.

April 28, 2026 / 06:06 PM IST

సంతగుడిపాడు స్వర్ణ సచివాలయంలో ఆకస్మిక తనిఖీ

PLD: సంతగుడిపాడు గ్రామంలోని స్వర్ణ సచివాలయాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పనితీరు, సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణతో పాటు ప్రజలకు అందుతున్న సేవలను సమగ్రంగా సమీక్షించారు. ఇలాంటి ఆకస్మిక తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు.

April 28, 2026 / 06:03 PM IST

‘ప్రాజెక్టుల భూసేకరణ త్వరగా పూర్తిచేసి అప్పగించాలి’

VZM: జిల్లాలో కొనసాగుతున్న కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజిల్ అంశం సద్దుమనిగే వరకు రెవిన్యూ అధికారులు బంకుల వద్ద పర్యవేక్షించాలని తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశించారు. స్టాక్ ఉండగానే ఇండెంట్ పెట్టేలా చూడాలన్నారు.

April 28, 2026 / 06:02 PM IST

కారు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

KKD: ముమ్మిడివరానికి చెందిన రాజులపూడి అనిల్ మంగళవారం కాకినాడ నుంచి యానాం వెళ్తుండగా వై జంక్షన్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. గుర్తుతెలియని కారు అనిల్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న కోరంగి ఎస్సై సత్యనారాయణ రెడ్డి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

April 28, 2026 / 06:00 PM IST