• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జూద స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్

BPT: పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనగల్లు గ్రామంలో జూదం జరుగుతోందన్న సమాచారం మేరకు ఎస్సై తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4,930 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడి పందాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 13, 2026 / 05:44 PM IST

మహిళలకు ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పిస్తోంది: కలెక్టర్

KRNL: ఢిల్లీలో జరిగిన నారీ శక్తి వందన్ సమ్మేళనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశాన్ని సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వీక్షించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధిపై ప్రధాని చేసిన ప్రసంగాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు ఆసక్తిగా వీక్షించారు. మహిళలకు ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పిస్తోందన్నారు.

April 13, 2026 / 05:40 PM IST

జనతా వారధి ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం: బీజేపీ

VSP: బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జనతా వారధి’ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డా. కేఎన్ఆర్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు, కన్వీనర్ పొలిమేర శ్రీనివాస్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి వినతులు స్వీకరించారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

April 13, 2026 / 05:40 PM IST

‘కార్యకర్తల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి’

AKP: టీడీపీ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు అప్పలనాయుడు తెలిపారు. ఇవాళ కే కోటపాడు మండలం గొట్లం, శృంగవరంలో పర్యటించి కార్యకర్తల సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పూర్తితో ‘కార్యకర్తే అధినేత’ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.

April 13, 2026 / 05:40 PM IST

ఎక్స్ మినిస్టర్‌కు ధన్యవాదాలు తెలిపిన నేతలు

ప్రకాశం: జరుగుమల్లికి చెందిన వైసీపీ నాయకుడు కొండూరి హర్షవర్ధన్ రెడ్డికి కీలక పదవి దక్కింది. ఆయన YCP స్టేట్ వాలంటరీ వింగ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం జరుగుమల్లి వైసీపీ మండల అధ్యక్షుడు పిన్నిక శ్రీనివాసరావుతో పలువురు నాయకులు ఆదిమూలపు సురేశ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

April 13, 2026 / 05:38 PM IST

అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు అమలు చేయాలని వినతి

E.G: అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ధవలేశ్వరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్నాలకోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు తక్షణం అమలు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10,000 స్టైఫండ్, 55 ఏళ్లు నిండిన న్యాయవాదులకు రూ.15,000 పెన్షన్ ఇవ్వాలని కోరారు.

April 13, 2026 / 05:30 PM IST

VOAల సమస్యలను పరిష్కరించాలి: సీఐటీయూ

W.G: పొదుపు సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్న వీవోఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. సోమవారం వీరవాసరం మండల పరిషత్ కార్యాలయం వద్ద వీవోఏలు నిరసన చేపట్టారు. విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న పని ఒత్తిడిని, ఇతర ఇబ్బందులను వివరిస్తూ ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

April 13, 2026 / 05:28 PM IST

కళాశాలలో ‘నారీ శక్తి’ చట్టంపై అవగాహన సదస్సు

AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘నారీ శక్తి’ వందన్ అధినియంపై ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ డా. ఎం.ధర్మారావు మాట్లాడుతూ.. మహిళలకు లోక్‌సభ, అసెంబ్లీ సీట్లలో 33% రిజర్వేషన్ కల్పించే ఈ చట్టం 2029 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. 2044 వరకు మహిళల రాజకీయ భాగస్వామ్యం పెరిగి దేశ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

April 13, 2026 / 05:25 PM IST

ఏపీ టీఎంసీ కాటన్ ఫ్యాక్టరీస్ ప్రమాణస్వీకారం

గుంటూరులో ఏపీ టీఎంసీ కాటన్ కాన్సారియం జిన్నింగ్ & ప్రెస్సింగ్ ఫ్యాక్టరీస్ జనరల్ బాడీ ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎల్చూరి వెంకటేశ్వర్లు ప్రమాణస్వీకారం నిర్వహించారు. ఉప్పుటూరి సాంబశివరావు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగా, ఇతర పదవుల్లో పలువురు నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

April 13, 2026 / 05:24 PM IST

అర్జీలు స్వీకరించిన ఎస్పీ

CTR: ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో సోమవారం ఎస్పీ తుషార్ డూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి 44 ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను త్వరతగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

April 13, 2026 / 05:20 PM IST

బాధిత రైతుకు నష్టపరిహారం అందజేత

NDL: రుద్రవరంలోని భూమునాయుడుపల్లె గ్రామానికి చెందిన రైతు సుధాకర్‌కు చెందిన 2 ఆవులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతి చెందాయని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన PGRS కార్యక్రమంలో సంబంధిత రైతుకు నష్టపరిహారాన్ని ఆమె అందజేశారు. రైతు ఎదుర్కొన్న కష్టాన్ని పరిగణలోకి తీసుకొని పశుసంవర్తక శాఖ నివేదిక ఆధారంగా జిల్లా యంత్రాంగం తరఫున రూ.1 లక్ష అందజేశామన్నారు.

April 13, 2026 / 05:20 PM IST

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

BPT: ప్రజల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను కలెక్టర్ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు.

April 13, 2026 / 05:20 PM IST

తిరుచానూరులో TDP నేతల వసూళ్లు: వైసీపీ

TPT: తిరుచానూరులో అమ్మవారి ఆలయం వద్ద టీడీపీ నేతలు వసూళ్ల దందా చేస్తున్నారని వైసీపీ మండిపడింది. ‘ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఎదురు తిరిగిన భక్తులపై పాశవికంగా దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ గూండాలు మరింతగా రెచ్చిపోతున్నారు. భక్తులు ఇంత ఇబ్బంది పడుతున్నా టీటీడీ చోద్యం చూస్తోంది’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

April 13, 2026 / 05:05 PM IST

తుమ్మి కాపల్లిలో మామిడి టేకు తోటలు దగ్ధం

VZM: గజపతినగరం మండలంలోని తుమ్మి కాపల్లి గ్రామంలో ఇవాళ జరిగిన అగ్ని ప్రమాదంలో మామిడి టేకు తోటలు కాలిపోయాయి. గ్రామానికి చెందిన ఎస్ శంకర్ ఎస్ పైడితల్లి ఎస్ నారాయణప్పుడు కె తాతి నాయుడు కె నారాయణల కు చెందిన 10 ఎకరాల విస్తీర్ణంలో గల మామిడి టేకు తోటలో కాలిపోవడంతో రూ. లక్ష వరకు ఆస్తి నష్టం సంభవించిందని స్థానికులు తెలపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

April 13, 2026 / 05:05 PM IST

కౌతాళంలో జలధార–జల హారతి కార్యక్రమం

KRNL: కౌతాళం మండలం వల్లూరు చెరువు వద్ద ఇవాళ “జలధార–జల హారతి” కార్యక్రమం నిర్వహించారు. మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నీటి చుక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు పెంచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

April 13, 2026 / 05:03 PM IST