• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పాడేరులో కూలిపోవడానికి సిద్ధంగా విద్యుత్ స్తంభాలు

ASR: పాడేరు మండలం నీకాయిపాడులో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇనుప విద్యుత్ స్తంబాలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గ్రామంలో ఐదు స్తంభాలు ప్రమాదకర స్థితిలో ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశముందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు స్పందించి నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

April 9, 2026 / 06:41 AM IST

ఏలేరు రిజర్వాయర్‌లో మృతదేహం లభ్యం

KKD: ఏలేరు రిజర్వాయర్ పవర్ ప్లాంట్ బిట్-2 సమీపంలో బుధవారం వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మత్స్యకారుల సమాచారంతో మత్స్య శాఖ అధికారి రాజేంద్రరావు బోట్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడు జడ్డంగి అన్నవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా ఎస్సై రామలింగేశ్వరరావు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

April 9, 2026 / 06:39 AM IST

నేటి నుంచి యథావిధిగా మంచినీటి సరఫరా: కమిషనర్

VZM: రాజాం పట్టణంలో గురువారం నుంచి యథావిధిగా కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్‌ రామచంద్రరావు బుధవారం తెలిపారు.ఆయన మాట్లాడుతూ.. రేగిడి మండలం మజ్జి రాముడు పేట వద్ద ప్రధాన పైపులైను మరమ్మతు పనులు పూర్తై నేపథ్యంలో యథావిధిగా నీటిని పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా ప్రజలను కోరారు.

April 9, 2026 / 06:14 AM IST

నాయుడుపేటలో అక్రమంగా కలప తరలింపు

TPT: నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాసపురం సోషల్ ఫారెస్ట్ భూముల్లో నీలగిరి తైలం చెట్లను కొందరు వ్యక్తులు అక్రమంగా నరికి తరలిస్తున్నారు. టన్నుల పరిమాణంలో కలపను తరలిస్తున్నప్పటికీ, రెవెన్యూ, ఫారెస్ట్, మున్సిపాలిటీ అధికారులు ఈ అక్రమాన్ని పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

April 9, 2026 / 06:11 AM IST

మూల్యాంకనంలో తప్పులు దొర్లితే కఠిన చర్యలు: కలెక్టర్

EG: బాల విజ్ఞాన్ మందిర్ పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘా, అధికారులకు అందుతున్న వసతులపై డీఈవో వాసుదేవరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పాట్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. 

April 9, 2026 / 06:11 AM IST

మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఎమ్మెల్యే

ATP: పుట్లూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

April 9, 2026 / 06:10 AM IST

తాగునీటి కష్టాలు.. ఇబ్బందుల్లో ప్రజలు

CTR: వేసవి ప్రారంభమవ్వడంతో పల్లెల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పలమనేరు రూరల్ జరావారి పల్లి, పకీరుపల్లి, పి. వడ్డూరులో బోరు మోటార్లు పనిచేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం నుంచి నీరు తెచ్చుకుంటున్నామన్నారు. ఆరు నెలల నుంచి చెబుతున్నా ఏ నాయకుడు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

April 9, 2026 / 06:10 AM IST

అర్ధరాత్రి బస్సుల తనిఖీలు.. ఉల్లంఘనలపై కఠిన చర్యలు

గుంటూరు: మంగళగిరి ఖాజా టోల్ ప్లాజా వద్ద మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్సుల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలు, డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించారు. 20కి పైగా బస్సులు చెక్ చేసి, నిబంధనలు పాటించని ఒక బస్సును సీజ్ చేశారు. 15 బస్సులపై జరిమానాలు విధించారు. ప్రయాణికుల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

April 9, 2026 / 06:01 AM IST

అక్రమంగా నిలువ ఉంచిన గ్యాస్ సిలిండర్లు పట్టివేత

ప్రకాశం: తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని గోదాంలో అక్రమంగా నిలువ ఉంచిన 21 సిలిండర్ లను ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. రాబడి సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన అధికారులు డొమెస్టిక్ సిలిండర్లు 15, కమర్షియల్ సిలిండర్లు 6 స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిలువ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

April 9, 2026 / 06:00 AM IST

115 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల స్వాధీనం

KRNL: కర్నూలులోని వాణిజ్య సముదాయాలపై అధికారులు బుధవారం దాడులు చేశారు. నగరవ్యాప్తంగా 156 వాణిజ్య సంస్థలను తనిఖీ చేసిన అధికారులు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపట్టారు. అక్రమంగా ఉపయోగిస్తున్న 115 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యాపారులపై 103 సెక్షన్ 6ఏ కింద కేసులు నమోదు చేశారు.

April 9, 2026 / 06:00 AM IST

డ్రాగన్ బోట్ పోటీల్లో ఏకపక్ష నిర్ణయాలపై అభ్యంతరం

KRNL: రాజమండ్రిలో మే 30, 31న జరగనున్న అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ పోటీలలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బుధవారం ఏపీ డ్రాగన్ బోట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవినాష్ ఆరోపించారు. అసోసియేషన్‌కు సమాచారం ఇవ్వకుండా పోటీలు నిర్వహించడం సరికాదన్నారు. అధికారిక గుర్తింపు ఉన్న ఫెడరేషన్లను సంప్రదించి పోటీలు నిర్వహించాలన్నారు.

April 9, 2026 / 05:00 AM IST

నేడు డోన్‌లో ఎమ్మెల్యే పర్యటన

NDL: డోన్ మండలం కొత్తబురుజులో గురువారం నూతన తాగునీటి పైప్ లైన్ శంకుస్థాపనకు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి హాజరవుతున్నారని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఈ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

April 9, 2026 / 05:00 AM IST

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: గౌరు చరిత

NDL: కల్లూరు అర్బన్లోని లక్ష్మీపురంలో బుధవారం ప్రమాదవశాత్తు గడ్డివాములు దగ్ధం అయ్యాయి. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఘటనా ప్రదేశానికి సంబంధిత అధికారులతో వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనలో రైతులు కురువ గోవింద్, చిన్న సుంకన్న, కురువ పెద్ద సుంకన్నకు కలిపి మొత్తం దాదాపు రూ.2 లక్షల నష్టం జరిగినట్లు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు.

April 9, 2026 / 04:00 AM IST

కౌమార దశలో గర్భధారణ ప్రమాదకరం: కలెక్టర్

KRNL: కౌమార దశలో గర్భధారణ బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుకు ప్రమాదకరమని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్‌ను బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. బాల్య వివాహాల నివారణ, బాలికల విద్య ప్రోత్సాహం ద్వారా సమస్యను అరికట్టాలని ఆమె సూచించారు. ICDS పీడీ విజయ, DMHO డా.కామేష్ పాల్గొన్నారు.

April 9, 2026 / 04:00 AM IST

గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో పోలీసుల సమీక్ష

CTR: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, ఐపీఎల్ బెట్టింగ్ నియంత్రణపై అవగాహన పెంచాలని అధికారుల సూచించారు. గ్రామ స్థాయిలో మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచేలా కార్యదర్శులు వారధిలా పనిచేయాలని సూచించారు.

April 8, 2026 / 10:14 PM IST