• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కాలువ పూడికతీత పనుల ప్రారంభం

GNTR: చేబ్రోలు (మం) పాతరెడ్డిపాలెంలో పంట కాలువ పూడికతీత పనులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర శనివారం శంకుస్థాపన చేశారు. రూ.8 లక్షలతో ఈ పనులు చేపట్టారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. కాలువల ఆధునీకరణతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందని చెప్పుకొచ్చారు. రైతుల ఇబ్బందులు తొలగించేలా ఈ పనులను త్వరగా పూర్తి చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

May 30, 2026 / 02:27 PM IST

ఉచిత కంప్యూటర్ శిక్షణ ముగింపు కార్యక్రమం

WG: పోటీ ప్రపంచంలో విద్యతోపాటు నైపుణ్యాల అభివృద్ధి కూడా ముఖ్యమని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. ఆకివీడు మండలం దుంపగడప వివి గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని వక్తలు పిలుపునిచ్చారు.

May 30, 2026 / 02:21 PM IST

ఘనంగా ముగ్గురు అధికారులకు వీడుకోలు కార్యక్రమం

ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు అధికారులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఏఆర్ అదనపు ఎస్పీ జి. ముని రాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుదీర్ఘకాలం పాటు శాఖకు విశిష్ట సేవలు అందించిన మర్రి సత్యనారాయణ (RSI), కె. ఆంజనేయులు (ARSI), మరియు ఎమ్. అర్లప్ప (HC) కు పోలీసు కోపరేటివ్ సొసైటీ పొదుపు చెక్కులను అందించారు.

May 30, 2026 / 02:19 PM IST

సుండుపల్లెలో అభివృద్ధి పనులకు శ్రీకారం

అన్నమయ్య: సుండుపల్లెలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలిశెట్టి హరి ప్రసాద్, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు,తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు అభివృద్ధి పనులను ప్రారంభించి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

May 30, 2026 / 02:12 PM IST

‘సీఎం సహాయనిధి పేద ప్రజలకు కొండంత అండ’

ATP: ఆపదలో అత్యవసర చికిత్సలు చేయించుకున్న వారికి సీఎం సహాయనిధి ఎంతో ఊరటనిస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం రాయదుర్గంలో 24 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.13 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 387 మందికి రూ.2.58 కోట్ల సహాయం అందిందని తెలిపారు.

May 30, 2026 / 02:01 PM IST

వైసీపీ ట్రాప్‌లో తెలంగాణ విశ్లేషకులు: జనసేన నేత

SS: తెలంగాణలో కొందరు విశ్లేషకులు వైసీపీ ట్రాప్‌లో ఉండి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపాలని చూడటం సరైన పద్ధతి కాదని ధర్మవరం జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ దేశ నాయకుడని, తెలుగు ప్రజల శ్రేయస్సే ఆయన ధ్యేయమన్నారు. కొందరు వైసీపీ కోవర్టులుగా మారి పవన్ కళ్యాణ్‌పై అనవసర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.

May 30, 2026 / 01:45 PM IST

జిల్లా రైతులకు సాగు భారం

ATP: జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల నిరంతర పెరుగుదల ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపుతోంది. డీజిల్ ధరలు పెరగడంతో జిల్లాలో ట్రాక్టర్ బాడుగలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గతంలో గంటకు రూ. 900 లుగా ఉన్న టిల్లర్ బాడుగను ప్రస్తుతం రూ. 1000 కి పెంచారు. ట్రాక్టర్ యజమానులు రకాన్ని బట్టి గంటకు రూ.100 నుంచి రూ. 200 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.

May 30, 2026 / 01:43 PM IST

రత్నాల చెరువులో ‘క్లీన్ స్వీప్’ పారిశుద్ధ్య పనులు!

GNTR: మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతంలో సాగుతున్న ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ పనులను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి శనివారం పరిశీలించారు. MTMC కమిషనర్ ఆలీమ్ బాషా ఆధ్వర్యంలో జేసీబీలతో ఈ పూడికతీత పనులు జరుగుతున్నాయి. వర్షాకాలం లోపు డ్రైనేజీల్లో మట్టిని తొలగించి, మురుగునీరు సాఫీగా సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు.

May 30, 2026 / 01:40 PM IST

ఆదోనిలో బాల్య వివాహం అడ్డుకున్న శక్తి బృందం

KRNL: ఆదోని మండల పరిధిలో జరగాల్సిన ఒక బాల్య వివాహాన్ని శక్తి బృందం అడ్డుకుంది. సమాచారం అందుకున్న రెవెన్యూ, శిశు సంక్షేమ, పోలీసు, సచివాలయ సిబ్బంది కలిసి విచారణ చేపట్టారు. ఇరు కుటుంబాల సభ్యులను పెద్దతుంబలం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఇవాళ ఎస్ఐ విద్యాశ్రీ, సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాల అనర్థాలను వివరించి, చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

May 30, 2026 / 01:40 PM IST

సీఎం సహాయనిధి పంపిణీ చేసిన కావలి ఎమ్మెల్యే

NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. వైద్య చికిత్సలు, అత్యవసరాల కోసం, ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని అర్హులకు అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఊరటనీస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

May 30, 2026 / 01:36 PM IST

‘జనగణనకు నేటితో గడువు ముగింపు’

కోనసీమ: జనగణన ప్రక్రియకు శనివారం చివరి రోజు కావున ప్రజలందరూ ఎన్యుమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని రావులపాలెం ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం కోరారు. ప్రజలు అందించే వివరాల ఆధారంగానే దేశ ఆర్థిక ప్రణాళికలు రూపొందించబడతాయని, జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు గ్రాంట్లు మంజూరు అవుతాయని తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ క్లస్టర్లలో 100 శాతం పూర్తి చేయాలన్నారు.

May 30, 2026 / 01:36 PM IST

జూన్ 2న బీఎల్ఏల శిక్షణా సమావేశం: శైలజనాథ్

ATP: ​శింగనమల నియోజకవర్గ YCP బీఎల్ఏల శిక్షణా సమావేశం జూన్ 2న నార్పలలోని ఎస్వీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలు, సమన్వయకర్త సాకే శైలజనాథ్ సూచనలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించే ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొననున్నారు.

May 30, 2026 / 01:32 PM IST

బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు నమోదు

PLD: హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు సంబంధించిన భూవ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గండిపేట ప్రాంతంలోని భూమికి సంబంధించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీల అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో పలువురి పాత్రపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు దశలో ఉందని పోలీసులు వెల్లడించారు.

May 30, 2026 / 01:30 PM IST

శ్రీశైలం ఎమ్మెల్యే‌ను కలిసిన అంగన్వాడీలు

NDL: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ శనివారం కలిశారు. ఇటీవల నియమితులైన పలువురు వేల్పనూరులో ఎమ్మెల్యే గృహానికి వెళ్లి ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, విధులపట్ల అంకిత భావంతో పనిచేసే పిల్లలకు, గర్భిణీలకు మెరుగైన సేవలు అందించాలని అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ కు సూచించారు.

May 30, 2026 / 01:30 PM IST

పొగాకు నియంత్రణపై అవగాహన కార్యక్రమం

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖల్లు పీహెచ్‌సీలో ప్రపంచ పొగాకు నియంత్రణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారి మాట్లాడుతూ.. పొగాకు వినియోగం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. యువత పొగాకుకు దూరంగా ఉండాలని, సమాజంలో పొగాకువ్యతిరేక చైతన్యం పెంపొందించాలని పిలుపునిచ్చారు.

May 30, 2026 / 01:27 PM IST