KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో శనివారం జరిగిన సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలకు 87 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండో సెమిస్టర్ పరీక్షలకు 578 మందికి 490 మంది విద్యా ర్థులు హాజరు కాగా, 87 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో ఆదివారం చికెన్, మటన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. వ్యాపారుల సమాచారం మేరకు స్కిన్‌తో చికెన్ కేజీ రూ.181, స్కిన్‌లెస్ చికెన్ రూ.206గా విక్రయిస్తున్నారు. నాటుకోడి మాంసం కేజీ రూ.700కు, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని వ్యాపారులు తెలిపారు.
ATP: జిల్లాలో డీజిల్ కొరత లేదని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ స్పష్టం చేశారు. కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు ఆయన సూచించారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిల్వలు ఉన్నాయన్నారు. డిమాండ్ మేరకు ఇంధనం సరఫరా చేయాలని సంబంధిత బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ సేల్స్ ఆఫీసర్లకు తెలియజేశామన్నారు.
NDL: జనాభా గణనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో ఆదివారం ఉదయం 7:30 గంటలకు నంద్యాలలోని టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి గాంధీచౌక్ వరకు 5కే రన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టర్ ఛాంబర్లో సెన్సస్ ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న 5K రన్ కార్యక్రమానికి సంబంధించిన టీ-షర్ట్‌లను శనివారం కలెక్టర్ ఆవిష్కరించారు.
సత్యసాయి: లేపాక్షిలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో ఎండ తీవ్రత కారణంగా భక్తులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. దేవస్థానం ఈవో ఎం.హెచ్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయంలో భక్తులు నడిచే ప్రదేశాల్లో మ్యాట్లు ఏర్పాటు చేశారు. దీంతో ఎండలో కాలుతున్న రాళ్లపై నడవడం సులభమైనందుకు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా: మచిలీపట్నం మండలం పెద్దకరగ్రహారం, చిన్నకరగ్రహారం గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్ల స్థలాలను మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. 13 బ్లాకుల్లో సుమారు 16 వేల ఇళ్ల పట్టాలు కేటాయించినప్పటికీ కనీస వసతులు కల్పించకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరా, రోడ్ల సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.
కోనసీమ: అమలాపురం మార్కెట్‌లో ఆదివారం కూరగాయల ధరలు పెరిగాయి. కిలో వంకాయ రూ.60, చిక్కుడు కాయలు రూ.100, పచ్చిమిర్చి రూ.60 పలుకుతున్నాయి. క్యారెట్ రూ.50, బీరకాయ రూ.60గా ఉన్నాయి. ఎండల తీవ్రతకు పంటలు దెబ్బతినడంతో ధరలు పెరిగాయని వ్యాపారస్థులు తెలిపారు. మార్కెట్లను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. పెరిగిన ధరలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
కడప జిల్లాలో ఈ ఆదివారం చికెన్, మటన్ ధరలు కాస్త తగ్గాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం, కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ.181, స్కిన్‌లెస్ చికెన్ రూ.206, నాటుకోడి మాంసం కేజీ రూ.700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.
E.G: జిల్లాలో పారిశ్రామిక వృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ నిర్వహించిన ‘విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్’ అభివృద్ధి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ కారిడార్ ద్వారా జిల్లాలో ఎగుమతుల పెంపు జరుగుతుందన్నారు.
మన్యం: జిల్లాలో నిత్యావసర సరుకుల పంపిణీ అమలు తీరును పరిశీలించేందుకు జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీతానగరం మండలంలోని పెద్దభోగిలి గ్రామంలో ఉన్న ఫెయిర్ ప్రైస్ షాపును సందర్శించి రేషన్ సరుకుల నిల్వలు, పంపిణీ విధానం రికార్డులను పరిశీలించారు. సరుకుల పంపిణీని పారదర్శకంగా నిర్వహించాలని, అక్రమాలు చోటుచేసుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు.
NTR: విజయవాడ చిట్టి నగర్‌కు చెందిన చంటమ్మ (55) హార్ట్‌ఎటాక్ మృతి చెందింది. కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకొచ్చి ఆమె కార్ణియాలను దానం చేశారు. ఈ దానంతో ఇద్దరికి చూపు లభించనుంది. ఆమె ఉదారతను పలువురు ప్రశంసించారు. కుటుంబ సభ్యుల సేవా భావం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
విశాఖ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖకు రానున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్‌ను అధికారికంగా జిల్లా అధికారులు వెల్లడించారు. సోమవార సీఎం ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. రాత్రికి నగరంలోనే బస చేసి, గూగుల్ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందులో పాల్గొంటారు. అనంతరం 8.30 గంటలకు పోర్టు అతిథి గృహానికి చేరుకుని బస చేస్తారు.
కోనసీమ: జిల్లాలో అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో ఈ నెల 26న ఆదివారం సెలవు రోజు అయినా విద్యుత్ బిల్లులు యథావిధిగా కట్టించుకోవడం జరుగుతుందని జిల్లా APEPDCL ఎస్‌ఈ ఎస్.రాజేశ్వరి శనివారం తెలిపారు. అదే విధంగా సెక్షన్ ఆఫీస్ కౌంటర్లు, ఏటీపీ కేంద్రాలు పని చేస్తాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని ఆమె తెలిపారు.&...
TPT: శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. గుంట కింద పల్లికి చెందిన కే.రామిరెడ్డి (45) అనే రైతు, ఊరందూరు ఎస్టీ కాలనీలో పొలం పనులు నిర్వహిస్తుండగా విషపురుగు కాటుకు గురయ్యాడు. కాటు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
PLD: బెల్టు షాపుల నిర్వహణ వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయని, గ్రామాలలో బెల్ట్ షాపులు అరికట్టాలని పోలీస్ శాఖకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సూచించారు. నిన్న కొత్తపల్లిలో ఆయన మాట్లాడుతూ.. మద్యానికి బానిసై యువత చెడుదోవ పడుతున్నారన్నారు. యువతకు ప్రత్యేక అవగాహన కల్పించాలని, మాదకద్రవ్యాలపై చెడు వ్యసనాలపై జరిగే నష్టాన్ని వారికి వివరించాలని అధికారులకు ఆదేశించారు.