• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయండి’

W.G: MLA ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం అమరావతిలోని సచివాలయంలో CM చంద్రబాబుని కలిశారు. తణుకు నియోజకవర్గంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సీఎంకు వివరించారు. నియోజకవర్గంలోని మున్సిపల్ రహదారులు, భవనాల నిర్మాణం, పెండింగ్లో ఉన్న ఇతర పనులకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

April 10, 2026 / 08:29 PM IST

వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకం పొడిగింపు

అన్నమయ్య: వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తూ జీవోఎంఎస్ 43 జారీ చేసింది. ఈ పథకం ద్వారా అక్రిడిటెడ్, ఫ్రీలాన్స్, వేటరన్ జర్నలిస్టులు మరియు వారి కుటుంబాలకు క్యాష్‌లెస్ వైద్యం కొనసాగుతుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సమాచార అధికారి తెలిపారు.

April 10, 2026 / 08:28 PM IST

పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

ప్రకాశం: దర్శి మండలం పోతవరం గ్రామంలో శుక్రవారం పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజాబాబు పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

April 10, 2026 / 08:28 PM IST

YCP అధికార ప్రతినిధి శ్యామలను కలసిన శీను

KRNL: ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలను ఆ పార్టీ తుగ్గలి మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చెక్క శీను శుక్రవారం హైదరాబాదులో కలిశారు. ఆమెకు పూల మొక్కను అందజేశారు. మండలంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై శ్యామల ఆరా తీశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించినట్లు శీను తెలిపారు.

April 10, 2026 / 08:26 PM IST

‘రేపు జిల్లాలో 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు’

శ్రీకాకుళం జిల్లాలో రేపు 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. సరుబుజ్జిలి, సారవకోట, ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, ఎల్.ఎన్.పేట, పాతపట్నం మండలాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

April 10, 2026 / 08:20 PM IST

జిల్లా వాసులు జాగ్రత్తగా ఉండండి.!

GNTR: జిల్లాలో నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎండతీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

April 10, 2026 / 08:20 PM IST

రక్తదానం చేసిన జేసీ మౌర్య భరద్వాజ్

SS: పుట్టపర్తిలో జాతీయ సర్వే దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వే శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్వయంగా రక్తదానం చేసి సిబ్బందిని ప్రోత్సహించారు. జేసీ స్ఫూర్తితో సర్వేయర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా స్థాయి క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

April 10, 2026 / 08:20 PM IST

ప్రజా సంక్షేమం ప్రభుత్వంతో సాధ్యం: టీడీపీ ఇంఛార్జ్

KDP: రాజంపేట నియోజకవర్గంలో ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. ఈనెల 16న నిర్వహించనున్న మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. గ్రామ స్థాయిలో అవసరమైన వారికి సమాచారం అందించి శిబిరానికి హాజరు కావాలన్నారు.

April 10, 2026 / 08:19 PM IST

కడప ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి

KRNL: కడప జిల్లా ఖాజీపేటలో యువతి హత్యపై శుక్రవారం మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొంతు కోసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నిందితుడి వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కాగా తనను పెళ్లి చేసుకోలేదని యువతిని దారుణంగా శ్రీనివాస్ గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే.

April 10, 2026 / 08:14 PM IST

సీతంలో పోలిసెట్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

VZM: సీతం కళాశాలలో ఏప్రిల్ 4 నుంచి నిర్వహిస్తున్న ఉచిత పోలిసెట్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా.. ఇవాళ విద్యార్థులకు పోలిసెట్‌కు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బొత్స అనూష హాజరయ్యారు. సంస్థ అందిస్తున్న ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

April 10, 2026 / 08:14 PM IST

ఘనంగా ఏకలవ్య సంఘం వార్షికోత్సవం

W.G: అత్తిలి మండలం పాలూరులో ఏకలవ్య సంఘం 12వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంఘానికి చెందిన 12 మంది విద్యార్థులకు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు గ్రామ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు అల్లూరి రామకృష్ణంరాజు తెలిపారు. ఈ విద్యార్థుల్లో పదో తరగతి నుండి ఎంబీఏ చదివే విద్యార్థులు ఉన్నారని తెలిపారు.

April 10, 2026 / 08:11 PM IST

‘చారిత్రక సమస్యలకు శాశ్వత పరిష్కారం’

SKLM: జిల్లాలో చారిత్రక సమస్యలకు శాశ్వత పరిష్కారం తమ హయాంలో పరిష్కారం అవుతునందుకు ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇవాళ జిల్లాలోని మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కానీ నేరేడు బ్యారేజ్ సమస్యను పరిష్కరించామని, జులై 5న భోగాపురం ప్రారంభోత్సవానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

April 10, 2026 / 08:08 PM IST

ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్య అవగాహన శిక్షణ

VSP: ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ఆధ్వర్యంలో సిబ్బందికి ఇవాళ మద్దిలపాలెం డిపోలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బందికి వైద్య బృందాలు శిక్షణ ఇచ్చాయి. ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ అందించి 108 ద్వారా చికిత్సకు తరలించాలని తెలిపారు.

April 10, 2026 / 08:06 PM IST

ట్రాక్టర్ నగర్‌లో కలెక్టర్ పర్యటన

ATP: గార్లదిన్నె మండలంలోని దక్షిణ ప్రాంత వ్యవసాయ యంత్రాల శిక్షణ, పరీక్షణ సంస్థను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థలోని డ్రోన్ ప్రయోగశాల, టెస్టింగ్ ల్యాబ్‌లు, అత్యాధునిక వ్యవసాయ పరికరాలను ఆయన పరిశీలించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన శిక్షణార్థులు, స్థానిక రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

April 10, 2026 / 08:03 PM IST

జలధార పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

SS: జలధార-జలహారతి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని చెరువులు, కాలువలను త్వరితగతిన బాగు చేయాలన్నారు. మొబైల్ యాప్ వినియోగిస్తూ ప్రతి చెరువులోకి నీరు చేరేలా చూడాలన్నారు.

April 10, 2026 / 08:00 PM IST