• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జిమ్‌ను ప్రారంభించిన ఎస్పీ

CTR: చిత్తూరు సాయుధ దళ కార్యాలయంలో ఆధునిక సదుపాయాలతో నవీకరించిన జిమ్‌ను ఎస్పీ తుషార్ శనివారం ప్రారంభించారు. పోలీసు సిబ్బందికి శారీరిక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణ, విధి నిర్వహణలో మరింత సమర్థత సాధించేందుకు ఈ జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు.

May 30, 2026 / 06:26 PM IST

‘కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి’

ELR: జిల్లాలో మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు విజయవంతంగా ముగిశాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వర్చువల్ విధానంలో క్లస్టర్ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

May 30, 2026 / 06:13 PM IST

‘కార్యకర్తలకు అండగా ఉంటా’

NDL: చాగలమర్రిలో TDP కార్యకర్తలకు అండగా ఉంటానని ఆళ్లగడ్డ నియోజకవర్గం సీనియర్ నాయకుడు భార్గవ్ రామ్ అన్నారు. మండలంలోని చిన్న వంగలి గ్రామానికి చెందిన లక్కిరెడ్డి నరేంద్ర రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం భార్గవ్ రామ్ చిన్న వంగలి చేరుకొని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

May 30, 2026 / 06:07 PM IST

రైలు చోరీ కేసును చేదించిన పోలీసులు

BPT: చీరాల రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో చోరీకి పాల్పడిన నిందితుడిని చీరాల జీఆర్పీ పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. నిందితుడు సందీపన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అతడి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు గొలుసు,సెల్ఫోన్‌తో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలు, దర్యాప్తు ద్వారా కేసును త్వరగా ఛేదించినట్లు పోలీసు చెప్పుకొచ్చారు.

May 30, 2026 / 06:05 PM IST

జూన్ 2న మోగా జాబ్ మేళా

SKLM: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జూన్ 2 న ప్రభుత్వ డీఎల్‌టీసీ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. సుధ శనివారం తెలిపారు. ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని, మొత్తం 240 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

May 30, 2026 / 06:02 PM IST

విశాఖకు రూ.1,500 కోట్ల ప్రాజెక్టులు: ఎంపీ

VSP: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖకి రూ.1,500 కోట్ల విలువైన మూడు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మంజూరయ్యాయని ఎంపీ ఎం. శ్రీభరత్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన దిశా సమావేశంలో మాట్లాడారు. మధురవాడలో అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ, 24 గంటల తాగునీటి సరఫరా,సెమీ బల్క్ వాటర్ సప్లై అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు.

May 30, 2026 / 06:02 PM IST

ఆదివాసీలకు తీరని అన్యాయం: సీపీఎం

ASR: కూటమి ప్రభుత్వంలో ఆదివాసీలకు తీరని అన్యాయం జరిగిందని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్స ఆరోపించారు. శనివారం అరకులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిన్న పాడేరు పర్యటనకు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గిరిజన వికాసంపై ప్రకటన ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల హామీల అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

May 30, 2026 / 06:01 PM IST

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సింధూర రెడ్డి

సత్యసాయి: ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల స్వీకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కమిషనర్ శ్రీనివాసులతో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రతి అర్జీకి సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

May 30, 2026 / 06:00 PM IST

పోలీస్ అధికారులతో ఎస్పీ సమీక్ష సమావేశం

KRNL: నేర నియంత్రణే లక్ష్యంగా గట్టిగా పని చేయాలని, IPL ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలపాలపై గట్టి నిఘా ఉంచాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

May 30, 2026 / 05:54 PM IST

జనసేన పార్టీలోకి ఎస్సీ, ఎస్టీ నాయకుల చేరికలు

E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమక్షంలో కోరుకొండ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వారికి జనసేన కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై నాయకులు పార్టీలో చేరడం సంతోషకరమని ఎమ్మెల్యే బత్తుల పేర్కొన్నారు

May 30, 2026 / 05:50 PM IST

డాక్టర్ సుబ్బారెడ్డి సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే

NLR: కావలి ఏరియా ఆసుపత్రిలో 27 ఏళ్ల పాటు విశిష్ట సేవలు అందించిన సివిల్ సర్జన్ డాక్టర్ కే. సుబ్బారెడ్డి పదవీ విరమణ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, డాక్టర్‌ను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందడం గొప్ప విషయమని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కొనియాడారు.

May 30, 2026 / 05:50 PM IST

ఐనవోలు తిరుణాలలో జీవీ

PLD: నూజెండ్ల (మం) ఐనవోలులోని శ్రీ ఆంజనేయస్వామి తిరుణాల మహోత్సవంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకుడు నిస్శంకర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

May 30, 2026 / 05:45 PM IST

‘లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే ఉపేక్షించేది లేదు’

W.G: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో జి.గీతాబాయి హెచ్చరించారు. భీమవరంలోని కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, వాటిని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని అన్నారు.

May 30, 2026 / 05:44 PM IST

సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్సై

NTR: తిరువూరు గ్రంధాలయంలో ఉచిత శిక్షణా తరగతులలో భాగంగా విద్యార్థులు, తల్లితండ్రులకు సైబర్ నేరాల గురించి S.I గౌరీశ్వరి వివరించారు. విద్యార్థులు సెల్ ఫోన్ ఎందుకు ఉపయోగిస్తున్నారో తల్లితండ్రులు పర్యవేక్షించాలన్నారు. విద్యార్థులపై తల్లితండ్రులు ఒత్తిడి తేకుండా వాళ్ళకు ఇష్టమైన కోర్సు చేయించాలన్నారు. రకరకాలుగా మోసాలు జరుగుతున్నందున జాగ్రత్త వహించాలన్నారు.

May 30, 2026 / 05:44 PM IST

యువత క్రీడల్లో రాణించాలి: ఎస్పీ సతీష్ కుమార్

సత్యసాయి: కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఫ్రెండ్లీ పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎస్పీ సతీష్ కుమార్, MLA కందికుంట వెంకట ప్రసాద్ హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, నేరాలకు దూరంగా ఉండాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మైనర్లపై నేరాలకు పాల్పడితే పోక్సో చట్టం కింద శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

May 30, 2026 / 05:40 PM IST