KDP: ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. భారతదేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యాదవ్ కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు.
PLD: బెల్లంకొండలో బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కరణ కర్త మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ అని MRPS మండల నేతలు అన్నారు. ఆయన సేవలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు రాణించాలని కోరారు
ATP: యాడికి మండలంలో రేపు CM చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నివాసంలో టీడీపీ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, పలువురు ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై వారు చర్చించారు.
NTR: అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన సందర్భంగా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. రంగవల్లులతో ప్రాంగణం కళకళలాడగా “జై అమరావతి” నినాదాలు మార్మోగాయి. రాజధాని అభివృద్ధి ప్రజల ఆకాంక్ష అని, సీఎం నాయకత్వంలో వేగంగా ముందుకు సాగుతుందని సౌమ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుంటూరు: జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ అర్జీల స్టేటస్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. ‘మీకోసం’ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా అర్జీలు సమర్పించవచ్చు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం SR శంకరన్ హాల్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి.
కృష్ణా: గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో కామ్రేడ్ చింతపల్లి లక్ష్మారాయుడు 6వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆయన పేదల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. గ్రామాభివృద్ధి, పేదలకు నివాస స్థలాల కల్పనలో ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రకాశం: ఈస్టర్ మొదటి పౌర్ణమి తరువాత ఆదివారం జరుపుకునే పండుగని మంత్రి స్వామి అన్నారు. ఏసుక్రీస్తు మరణం తర్వాత మూడవరోజు సజీవుడుగా లేచిన రోజుగా పరిగణిస్తారని ఆయన జ్ఞాపకార్థం క్రైస్తవులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో ఈస్టర్ ఒకటని మంత్రి స్వామి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
E.G: తమ విలువైన వస్తువులైన బంగారం, వెండి, పత్రాలను దొంగతనాల బారి నుంచి కాపాడుకోవడానికి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కడియం CI వెంకటేశ్వరావు ఆదివారం సూచించారు. కుటుంబాలు ఎక్కువ కాలం పాటు తమ ఇళ్లను విడిచి వెళ్తున్నప్పుడు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలన్నారు. తద్వారా పోలీసులు ప్రజల కదలికను పర్యవేక్షిస్తారన్నారు.
అనకాపల్లి మండలం గుండాల శంకరన్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశంలో ఎన్నో ఉన్నత పదవులను నిర్వహించి అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేసినట్లు తెలిపారు.
శ్రీకాకుళంలో బాల భవన్ నందు సమగ్ర శిక్షా ఉద్యోగుల జేఏసీ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ కాంతారావు పాల్గొన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మే 15న మంత్రి లోకేష్ ఇంటి వరకు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.
VSP: మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా విశాఖలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. బీచ్ రోడ్డులోని ఆయన విగ్రహం వద్ద జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, విష్ణుకుమార్ రాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి అమోఘమన్నారు.
PPM: సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై రూ. 12 కోట్లతో పునర్ నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్‌ను, అలాగే మక్కువ అజ్జాడ మధ్య NDB రోడ్డును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ్ చంద్రతో కలిసి ప్రారంభించారు. పార్వతీపురం నియోజకవర్గంలో రవాణా కష్టాలు తీరాయి. ఈ వంతెనతో దశాబ్దాల నిరీక్షణ ఫలించిందని, మన్యం ప్రాంత కనెక్టివిటీ మెరుగుపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
GNTR: గుంటూరులో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని సాంఘిక సంక్షేమ శాఖ ఘనంగా నిర్వహించింది. మార్కెట్ కూడలి వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి తదితరులు నివాళులర్పించారు. అనంతరం విజ్ఞాన మందిరంలో సభ జరిగింది. దేశ ప్రగతిలో జగ్జీవన్ రామ్ పాత్ర కీలకమని కలెక్టర్ అన్నారు. ఆయన జీవితం యువతకు ఎంతో ఆదర్శమని అన్నారు.
ATP: రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త రామాంజనేయులును మాజీ ఎంపీ తలారి రంగయ్య పరామర్శించారు. బ్రహ్మసముద్రం మండలం జింకలదొడ్డి గ్రామానికి చెందిన బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
ప్రకాశం: కంభం మండలం నడింపల్లి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. శనివారం అర్ధరాత్రి సమయంలో రెండు ఇళ్లల్లో దొంగలు చోరీ చేశారు. 10 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి రూ.5 వేలు నగదు ఇళ్లల్లోకి ప్రవేశించి బీరువా పగలగొట్టి దొంగలు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.