NTR: జనగణన-2027లో భాగంగా నందిగామ పట్టణంలో మే 1 నుంచి 31 వరకు ఇళ్ల జాబితా లెక్కింపు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జీ. లోవరాజు తెలిపారు. దీనికి సంబంధించి సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. తొలి విడత ఏప్రిల్ 15-17, రెండవ విడత ఏప్రిల్ 20-22 వరకు బాబు జగ్జీవన్ రామ్ భవన్లో జరుగుతుందని వెల్లడించారు.
ప్రకాశం: టంగుటూరు (M) తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి వీరాంజనేయస్వామి ప్రజల వినతులు స్వీకరించారు. కొండపి నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. అర్జీలను పరిశీలించిన మంత్రి వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
VSP: ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇవాళ గాజువాకలో ‘పోషణపక్వాడ’ కార్యక్రమాన్ని ప్రారంభించి పోస్టర్లు విడుదల చేశారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణ సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. మొదటి 1000 రోజులు కీలకమని, అంగన్వాడీల ద్వారా అవగాహన పెంచుతున్నామన్నారు.
W.G: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆకివీడు ఎస్సై హనుమంతనాగరాజు సోమవారం హెచ్చరించారు. ఐపీఎల్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న సమాచార నేపథ్యంలో ఆకివీడు మండలం యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువత బెట్టింగ్ ద్వారా జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు.
VZM: ఒడిశా నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను విజయనగరం 1వ పట్టణ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 49.147 కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు, రూ.650 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
VSP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు లింగం శ్రీనివాసరావును రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించారు. మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు దక్షిణ సమన్వయకర్త వాసుపల్లిని మర్యాదపూర్వకంగా కలిశారు.
SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ అకాడమిక్ ఆడిట్ చేపట్టారు. రెండు విద్యా సంవత్సరాల కళాశాల పురోగతి, విద్యా సంబంధ నాణ్యతా ప్రమాణాలపై ఆడిట్ జరిగిందని ప్రిన్సిపాల్ డాక్టర్ టి. గోవిందమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. అకాడమిక్ అడ్వైజర్‌గా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జువాలజి అధ్యాపకులు S. రవి బాబు వ్యవహరించారు.
ASR: హుకుంపేట స్థానిక పబ్లిక్ గ్రీవెన్స్‌లో జనసేన నాయకుడు పరదాని సురేష్ ఎంపీడీవో రమాదేవికి వినతిపత్రం అందజేశారు. బారపల్లి పెంకిటి కాలనీ-గడ్డి కాలనీ వరకు సీసీ రోడ్డు, స్మశాన రహదారి, పాఠశాల ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ.. నిబంధనల మేరకు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కృష్ణా: గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ నివాసంలో జరిగిన చోరీ కేసును టూ టౌన్ పోలీసులు సోమవారం ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 5 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిందితులు చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని అన్నారు.
AKP: రాంబిల్లి మండలం దిమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవాళ సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆపరేషన్ థియేటర్లో ఎక్విప్మెంట్, పరికరాలు, ఏసీ వైరింగ్ దగ్ధం అయ్యాయి. సుమారు రూ. 5 లక్షల వరకు నష్టం జరిగిందని ఎలమంచిలి ఫైర్ ఆఫీసర్ రాంబాబు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సిబ్బందితో వెళ్లి మంటలను ఆర్పివేయడం జరిగిందన్నారు.
ATP: జిల్లాలో అక్రిడేషన్ మంజూరులో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు సీనియర్ జర్నలిస్టులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. సీనియర్ జర్నలిస్టులు భాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తినే జీవనాధారం చేసుకొని జీవనం సాగిస్తున్నామన్నారు. జర్నలిజం నమ్ముకున్న తమకు న్యాయం చేయాలన్నారు.
NLR: అల్లూరు మండలంలోని ఇందుపూర్ గ్రామంలో సోమవారం వివిధ పంటల్లో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. పంటలకు అధిక యూరియా వేయకూడదని తెలియజేశారు. మట్టి పరీక్షలు చేసిన తర్వాత, ఫలితాలు ఆధారంగా పంటలకు యూరియా, ఇతర రకాల ఎరువులు వేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఏవో కళారాణి, పీఎసీఎస్ ఛైర్మన్ హరికృష్ణ, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్లో సోమవారం రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యంపై తహశీల్దార్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువు దాటిన అర్జీలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భూ రీ-సర్వే పనులను వేగవంతం చేసి ఏప్రిల్ 30 నాటికి లక్ష్యాలను చేరాలని సూచించారు.
KKD: గండేపల్లి మండలం తాళ్లూరులో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని వైసీపీ గ్రీవెన్స్ సెల్ జాయింట్ సెక్రెటరీ ఒబ్బిడి వీరబాబు ఆవిష్కరించారు. సుమారు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా సేవలందించిన జగజ్జీవన్ రామ్ వ్యవసాయ, కార్మిక రక్షణ రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకొచ్చారని వక్తలు కొనియాడారు.
CTR: థియోసాఫికల్ సొసైటీ భూములపై మాట్లాడినందుకే తనపై కుట్ర జరిగిందని వైసీపీ నేత బుల్లెట్ సురేశ్ ఆరోపించారు. తన ఇంట్లో పనిచేసిన వారే దొంగతనానికి పాల్పడి, టీవీ రిపోర్టర్ సహాయంతో తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పి, వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.