• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

యాడికిలో సీఎం కాన్వాయ్ రిహార్సల్స్

ATP: CM చంద్రబాబు సోమవారం యాడికిలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్, కలెక్టర్ ఆనంద్ కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభా ప్రాంగణం, పెండేకల్లు రిజర్వాయర్ వరకు భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. బారికేడింగ్, అగ్నిమాపక చర్యలు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు.

April 6, 2026 / 06:43 AM IST

ఎమ్మెల్యే రమణమూర్తి నేటి పర్యటన వివరాలు

SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి సోమవారం ఉ. 10 కు పోలాకి మండలం ఓది పాడు గ్రామంలో, నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత, చెరువుల పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. మ.3 కు సారవకోట మండలం తహశీల్దార్ కార్యాలయనికి శంకుస్థాపన చేస్తారు. సా. 4 కు జలుమూరు KG BV పాఠశాల అదనపు తరగతి గదుల భవనాలను ప్రారంభిస్తారు. అని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ప్రకటనలో తెలిపారు.

April 6, 2026 / 06:40 AM IST

నేటి నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం

కడప నగరంలోని నగరపాలక ప్రధాన ఉన్నత పాఠశాలలో ఇవాళ నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యా శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జవాబుపత్రాలు జిల్లాకు వచ్చాయి. మొత్తంగా 1,95,674 జవాబు పత్రాలు ఉన్నాయి. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు DEO షంషుద్దీన్ తెలిపారు.

April 6, 2026 / 06:37 AM IST

భార్యతో గొడవ.. టవర్ ఎక్కిన భర్త

కోనసీమ: ఆలమూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ టర్నింగ్ వద్ద చీదల రామారావు అనే వ్యక్తి ఆదివారం భార్యతో గొడవపడి సమీపంలోని హైపవర్ కరెంట్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన ఎస్సై నరేశ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని రామారావును సురక్షితంగా కిందికి దింపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

April 6, 2026 / 06:37 AM IST

వల్లూరులో విగ్రహాలను ఆవిష్కరించిన వేగుళ్ల

కోనసీమ: కపిలేశ్వరపురం మండలం వల్లూరులో అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్, ఇందిరా గాంధీల విగ్రహాలను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మండపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం వారు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.

April 6, 2026 / 06:31 AM IST

నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

కాకినాడ కలెక్టరేట్లోని సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌ను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గం.ల నుంచి మధ్యాహ్నం 1గం వరకు సమస్యలపై వినతులను స్వీకరిస్తామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులంతా విధిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.

April 6, 2026 / 06:28 AM IST

పేకాట శివరం పై దాడి.. ముగ్గురు అరెస్ట్

E.G: గోపాలపురం మండల పరిధిలోని కోమటికుంట గ్రామ శివారులో ఆదివారం జూదం ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నాగేశ్వరనాయక్ ఆదివారం తెలిపారు. డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టి జూదం ఆడుతున్న వారిని గుర్తించారు. డ్రోన్‌ను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు

April 6, 2026 / 06:27 AM IST

నేడు పోలీసు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దు: ఎస్పీ

ATP: గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో నేడు జరగాల్సిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) రద్దు అయింది. బందోబస్తు, భద్రతా విధుల్లో పోలీసు అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

April 6, 2026 / 06:25 AM IST

గోదావరి పుష్కరాల నిర్వహణపై డీజీపీ సమీక్ష

E.G: గోదావరి పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదివారం రాజమండ్రిలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ కీర్తి చేకూరి, ఏలూరు రేంజ్ డీఐజీ, వివిధ జిల్లాల ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు హాజరయ్యారు. పుష్కరాల నిర్వాహణకు సమగ్ర ప్రణాళిక రూపొదించాలన్నారు.

April 6, 2026 / 06:20 AM IST

నేటి నుంచి రామయ్య క్షేత్రంలో ఆర్జిత సేవలు

KDP: ఒంటిమిట్ట కోదండ రామాయలంలో ఆర్జిత సేవలను నేటి నుంచి మళ్లీ పునరుద్ధరణ చేస్తున్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ ఆదివారం తెలిపారు. అర్చన చేయించాలంటే భక్తులు రుసుం రూ.10 చెల్లించాలని వివరించారు. అంతరాలయం ప్రవేశం (ఇద్దరికీ) రూ.50,ప్రతినెలా మాస పౌర్ణమికి జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొనాలంటే రూ.వెయ్యి చెల్లిస్తే ఇద్దరికీ అనుమతిస్తామని వివరించారు.

April 6, 2026 / 06:17 AM IST

విమానాశ్రయ కనెక్టివిటీ పనులు వేగవంతం చేయాలి – మంత్రి

VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధాన రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఆదివారం భోగాపురంలో మీడియాతో మాట్లాడుతూ.. విమానాశ్రయం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించామని, విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి సులభంగా రాకపోకలు కల్పించేలా రహదారి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

April 6, 2026 / 06:15 AM IST

వ్యాన్ ఢీకొని మహిళ మృతి, భర్తకు గాయాలు

SKLM: ఆమదాలవలస మండలం లక్ష్ముడుపేటకు చెందిన కామేశ్వరరావు, వనజాక్షి దంపతులు ఆదివారం రాత్రి రాంగ్ రూట్‌లో బైక్‌పై వెళ్తుండగా ఎచర్ల మండలం, కేశవరావు పేట వద్ద ఎదురుగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో వనజాక్షి తలకు తీవ్ర గాయాలతో మృతి చెందగా, కామేశ్వరరావుకు కాలికి గాయమైంది.

April 6, 2026 / 06:13 AM IST

విశాఖలో HYD మహిళ అనుమానాస్పద మృతి

విశాఖ: తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన అల్లూరి మణికుమారి(58) విశాఖ సిరిపురంలో గల తన కుమార్తె శిరీష నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. సమాచారం అందుకున్న 3 టౌన్ ఎస్సై చిన్నం నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 6, 2026 / 06:11 AM IST

నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

ATP: CM చంద్రబాబు నాయుడు సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. యాడికి మండలం వేములపాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుని, అక్కడ నుంచి పెండేకల్లు రిజర్వాయర్‌ను సందర్శిస్తారు. అనంతరం యాడికి మార్కెట్ యార్డులో నిర్వహించే ‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పలువురు అధికారులు తెలిపారు.

April 6, 2026 / 06:09 AM IST

అమరావతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

SS: రామగిరి మండలం నసనకోటలో అమరావతి రాజధానిగా పార్లమెంటు చట్టబద్ధత కల్పించడంపై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. మహిళలు ఇళ్ల ముందు ‘మా అమరావతి’ అంటూ వేసిన రంగవల్లులను ఆమె పరిశీలించారు. ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన నాగసుధ, నాగమణి, సరితలకు బహుమతులు అందజేసి శాలువాలతో సత్కరించారు.

April 6, 2026 / 06:03 AM IST