NLR: దక్షిణ తీర ప్రాంతాలైన తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మత్స్యకారులుతో గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. నెల్లూరు టౌన్ హాల్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా పలు అంశాలపై చర్చించనున్నారు. మత్స్యకారుల రక్షణతో పాటు సముద్ర తీరాల భద్రతపై కలెక్టర్ సూచనలు ఇవ్వనున్నారు. సమీక్ష అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడనున్నారు.
కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం వద్ద వేదాంత ఆయిల్ కంపెనీ ఎదుట నిరుద్యోగ యువత బుధవారం రాత్రి రోడ్డుపై పడుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న యాజమాన్యం స్పందించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. యాజమాన్యం దిగి రాకపోతే మూడవ రోజు కూడా కంపెనీ కార్యక్రమాలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
CTR: మరమ్మతుల్లో భాగంగా పీలేరులోని ఎల్బీఎస్ రోడ్డులో రైల్వే గేట్ మూసివేశారు. ఈ నేపథ్యంలో సదుం నుంచి పీలేరుకు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీస్ రూట్ మార్చారు. రైల్వే స్టేషన్, డిగ్రీ కాలేజ్, మదనపల్లె జాతీయ రహదారి మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.
SKLM: జి.సిగడాం మండలం ఆనందపురం గ్రామంలో గ్రామ కమిటీల పరిచయ వేదిక కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ గురువారం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను గుర్తుచేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి డైవర్సన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలుపించుకోవాలని సూచించారు.
CTR: జిల్లాలో పాడి రైతులకు పశు పోషణ భారంగా మారింది. గతంలో పొలాల వద్ద పచ్చిగడ్డి విరివిగా లభించేది. ప్రస్తుతం వేసవి కావడంతో పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. లభ్యత లేకపోవడంతో వరిగడ్డిని ఇతర జిల్లాల నుంచి రవాణా చేసుకుంటున్నారు. వాటికి అధికంగా డిమాండ్ ఉండటంతో ప్రస్తుతం ట్రాక్టర్ వరి గడ్డి రూ. 20 వేలు పలుకుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.
KRNL: మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని UTF మండల ప్రధాన కార్యదర్శి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ కోసిగి మం. జంపాపురం, సజ్జలగూడెం పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో సుమారు 50 శాతం మహిళలే ఉన్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలన్నారు.
కోనసీమ: జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎం.రంగారావు ఎన్నికయ్యారు. అమలాపురంలో గురువారం జరిగిన జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో రంగారావుని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా వై.సాయి వెంకట రమణారావు, ఉపాధ్యక్షులుగా నరేంద్ర కుమార్, కార్యదర్శిగా రాయుడు సత్తిరాజు, సహాయ కార్యదర్శిగా టి.మమత బాధ్యతలు స్వీకరించారు.
ATP: కనేకల్ మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రెహనా బేగం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయని టెన్త్ పాస్ అయిన విద్యార్థిని, విద్యార్థులు ఈ నెల 30 తేదీల్లోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
సత్యసాయి: మడకశిర మండలం మెలవాయి గ్రామంలో స్వాతంత్య్ర సమర యోధులు గోవింద రెడ్డి అంత్యక్రియలు గురువారం నిర్వహించారు. అంత్యక్రియలు మడకశిర RDO ఆనంద్ కుమార్, తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, RI సోమశేఖర్ రెడ్డి, VRO అనిత, మడకశిర CI సుబ్రహ్మణ్యం తదితర సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
TPT: ప్రముఖ సినీ నటి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దంపతులు తిరుమల శ్రీవారిని ఇవాళ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనంతో అధికారులు స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు.
CTR: చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర మే 12, 13వ తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని జాతర వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు తెలిపారు. మే 5న గంగమ్మ జాతర చాటింపు, 12న జాతర తొలి పూజలు చేస్తామని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం మహా కుంభ నైవేద్యం సమర్పిస్తామన్నారు. 13న నిమజ్జనం జరుగుతుందని తెలిపారు.
బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయాన్ని గురువారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పిల్లర్స్ పనులను ఆయన ప్రారంభించారు. అంతకుముందు విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తితోనే క్రమశిక్షణ, శాంతియుత జీవనం సాధ్యమని, గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
KKD: తుని పట్టణంలోని ప్రకాశం రోడ్డుపై ఆంజనేయ స్వామి గుడి వద్ద పరిస్థితి దయనీయంగా మారింది. వర్షం పడినప్పుడల్లా ఆ ప్రాంతం మొత్తం చెరువులా తయారవుతోంది. డ్రైనేజీ నీరు, వర్షపు నీరు కలిసిపోవడంతో రోడ్డుపై భారీగా ప్రవహిస్తున్నాయి. దుర్వాసన వెదజల్లే ఆ నీళ్ళు రోడ్డు మీదుగా పారుతుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
కృష్ణా: మచిలీపట్నం 6వ డివిజన్లో నిర్మాణంలో ఉన్న ఓ జనసైనికుడి ఇళ్లు కూల్చివేత కూటమిలో అంతర్యుద్ధానికి దారి తీసింది. అక్రమ కట్టడమంటూ శ్రీపతి వెంకటాచలం ఇంటిని ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఇది కూటమిలోని TDP Vs జనసేనగా మారింది. మంత్రి కొల్లు రవీంద్ర దీన్ని అక్రమ కట్టడమని అధికారుల చర్యలను సమర్ధిస్తే జనసేనకు చెందిన MP బాలశౌరి మాత్రం తప్పు పట్టారు.
ఎన్టీఆర్: విజయవాడలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వినూత్న చర్యగా డ్రోన్ల ద్వారా నీటి తుంపర్లు (మిస్ట్) వెదజల్లే కార్యక్రమాన్ని కలెక్టర్ జి.లక్ష్మీశ క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించారు. మహాత్మా గాంధీ రోడ్, అంబేద్కర్ స్మృతి వనం వద్ద ఈ కార్యక్రమాన్ని VMC అధికారులతో కలిసి పరిశీలించారు.