• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. సాయంత్రం 7 గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహించి గరుడ పటాన్ని అవతనం చేశారు.బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులు పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధి పొందుతారని ఐతిహ్యం. సకల శ్రేయస్సులు కలుగుతాయని విశ్వాసం.

April 5, 2026 / 07:40 AM IST

‘గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించండి’

KRNL: ఈనెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నేపథ్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో కలిసి గ్రామాల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. విలేజ్ అర్బన్ సెంటర్లలో ప్రచారం చేపట్టాలని సూచించారు.

April 5, 2026 / 07:40 AM IST

విశాఖలో ఈరోజు మాసం ధరలు ఎంతంటే..!

VSP: విశాఖలోని పలు ప్రాంతాల్లో ఆదివారం చికెన్ ధరలు కేజీల్లో ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ లైవ్ రూ.145, స్కిన్తో రూ.260, స్కిన్ లెస్ రూ. 270, శోంఠాం రూ.300లకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.1000కు, డజన్ గుడ్లు రూ.55లకు అమ్మకాలు చేపట్టారు. అప్పుఘర్, ఎంవీపీ, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాల్లో తాజా చాపల కోసం కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు.

April 5, 2026 / 07:37 AM IST

పారా అథ్లెటిక్స్‌లో ‘అనంత’ హవా!

ATP: నెల్లూరులో జరిగిన 8వ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అనంతపురం జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 44 పతకాలు సాధించిన విజేతలకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంస్థ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా నుంచి 41 మంది పాల్గొనగా 22 స్వర్ణ, 16 రజత, 10 కాంస్య పతకాలు రావడం విశేషం.

April 5, 2026 / 07:30 AM IST

‘రహదారులపై చెత్త వేస్తె కఠిన చర్యలు’

కోనసీమ: స్వచ్ఛ మండపేట సాధనే లక్ష్యంగా పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై కమిషనర్ టీవీ రంగారావు శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులపై ప్రతిరోజూ రాత్రి సమయాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యాపార సంస్థల నిర్వాహకులు రహదారులపై బహిరంగంగా చెత్త వేయకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

April 5, 2026 / 07:30 AM IST

‘మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే రెండేళ్లు డిబార్’

KRNL: ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పార్ట్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్రశేఖర్ తెలిపారు. శనివారం కర్నూలు మెడికల్ కాలేజీలో జరుగుతున్న పరీక్షలను ఆయన తనిఖీ చేసి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే రెండేళ్ల వరకు డీబార్ చేస్తామని హెచ్చరించారు.

April 5, 2026 / 07:30 AM IST

బంగారం విడిపించాలంటూ.. రూ. 19లక్షలతో ఉడాయింపు

గుంటూరు: అరండల్‌పేటలో బంగారం వ్యాపారిని మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. ఫైనాన్స్‌లో ఉన్న తన బంగారాన్ని విడిపించాలంటూ నమ్మబలికి ఓ మహిళ వ్యాపారి వద్ద నుంచి రూ.19 లక్షల నగదు, రూ.4 లక్షల విలువైన ఆభరణాలు తీసుకుంది. తరువాత వాటిని తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటుండటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 5, 2026 / 07:26 AM IST

రెవెన్యూ సమస్యలు తక్షణమే పరిష్కరించండి: ఎమ్మెల్సీ

KDP: పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి రెవెన్యూ సమస్యలపై అధికారులతో శనివారం సమావేశమయ్యారు. భూ తగాదాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని, రీ-సర్వేలో జరిగిన పొరపాట్లను సరిచేయాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు.

April 5, 2026 / 07:20 AM IST

దౌర్జన్యంగా భూమి ఆక్రమణకు ప్రయత్నాలు

AKP: ఎస్ రాయవరం మండలం గెడ్డంపాలెం గ్రామంలో కొవ్వూరు సుబ్బరాజు అనే సాధువు తనకు వీలునామా రాసిన మూడున్నర ఎకరాల భూమిని గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించుకోవడానికి చూస్తున్నట్లు రైతు సుబ్బన్న తెలిపారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సాధువు గత ఏడాది మృతిచెందే ముందు ఆయనకు సంబంధించిన భూమిని తన పేరు మీద వీలునామా రాసినట్లు తెలిపారు.

April 5, 2026 / 07:18 AM IST

తిరుమలలో ఈ విషయం మీకు తెలుసా.?

TPT: తిరుమలలో శ్రీవారి ఆరాధనలు వైఖానస ఆగమం ప్రకారం జరుగుతాయి. 650 ఏళ్ల క్రితం స్వామి వారు అర్చకుని కలలో ప్రత్యక్షమై మలయప్ప కోనలోని విగ్రహాలను తెచ్చి ఉత్సవమూర్తులుగా ప్రతిష్ఠించాలని ఆజ్ఞాపించారట. గుహలోని ఆ విగ్రహాలు ఆశ్చర్యకరంగా కాంతివంతంగా ఉండేవట. అప్పటి నుంచి మలయప్ప స్వామి ప్రతిరోజూ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

April 5, 2026 / 07:13 AM IST

ఘనంగా కోదండరామస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం

CTR: చిత్తూరు శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం ఉత్సవ మూర్తులను ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షించారు.  ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే సోదరుడు జీవన్ పాల్గొన్నారు.

April 5, 2026 / 07:12 AM IST

మంత్రి నివాసం వద్ద టీడీపీ శ్రేణుల సంభరాలు

VZM: అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటు ఉభయసభలలో బిల్లు ఆమోదం పొందడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్దాతిరేకాలు వ్యక్తం చేశారు.ఈ మేరకు శనివారం రాత్రి గజపతినగరంలోని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ నివాసం వద్ద కొవ్వొత్తులతో దీపాలు వెలిగించి ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన టీడీపి నాయకులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

April 5, 2026 / 07:10 AM IST

గాలివీడు పీహెచ్సీ డాక్టర్ మహ్మద్ రఫీ సస్పెండ్

అన్నమయ్య: గాలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులకు హాజరు కాకుండా గైర్హాజరు అయిన డాక్టర్ రఫీని డీఎంహెచ్ సస్పెండ్ చేశారు. ఇటీవల కలెక్టర్ నిశాంత్ తనిఖీలో ఆయన ఆస్పత్రిలో లేకపోవడం, అటెండెన్స్‌లో సంతకం చేసి వెళ్లిపోవడం గుర్తించారు. ఈ నేపథ్యంలో విచారణ అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయగా, విధుల్లో నిర్లక్ష్యం చూపిన ఉద్యోగి మనోజ్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

April 5, 2026 / 07:10 AM IST

గెలుపే లక్ష్యం: దద్దాల పిలుపు

ప్రకాశం: కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ పార్టీ శ్రేణులకు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎస్ పురంలో జరిగిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో పాల్గొని, ఐక్యతతో క్షేత్రస్థాయిలో చురుకుగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని అన్నారు.

April 5, 2026 / 07:09 AM IST

కొలిమిగుండ్ల సీఐ కీలక హెచ్చరిక

NDL: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబు ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఆన్లైన్, ఆఫ్-లైన్ బెట్టింగ్లపై నిఘా ఉంచామని తెలిపారు. బెట్టింగ్ వలలో చిక్కుకుని లక్షలాది రూపాయలు అప్పులు చేసి, ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలను గుర్తుచేశారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

April 5, 2026 / 07:09 AM IST