• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బోటు రిజిస్ట్రేషన్ పత్రాలు అందించిన ఎమ్మెల్యే

కృష్ణా: నాగాయలంక మండలం ఎదురుమొండిలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మత్స్యకారులకు బోటు లైసెన్సులు, రిజిస్ట్రేషన్ పత్రాలను శుక్రవారం అందచేశారు. సముద్రంలో చేపల వేటకు అనువుగా ఎదురుమొండి పరిధిలోని అరవై మంది మత్స్యకారులకు ఈ పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ నాగరాజా, ఎఫ్.డీ.వో సత్యనారాయణ, ఫిషరీస్ కో-ఆపరేటివ్ సోసైటీ అధ్యక్షులు చెన్ను వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

April 10, 2026 / 05:28 PM IST

మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ స్పీకర్

SKLM: వైఎస్‌ఆర్ మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ఆమదాలవలస తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఉనికి కోసం చనిపోయిన వ్యక్తిపై బురద చల్లడం అచ్చెన్నాయుడి దిగజారుడుతనానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్ చిరస్మరణీయమన్నారు.

April 10, 2026 / 05:27 PM IST

ఆసుపత్రికి అంబులెన్స్ బహుకరణ

ELR: చెబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎమ్మెల్యే ధర్మరాజు చేతుల మీదుగా గుండుగొలను తిరుమల పాల డైరీ యాజమాన్యం ఆసుపత్రి వైద్యాధికారులకు అంబులెన్స్‌ను అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సార్థకంగా అమలవుతోందనీ ఎమ్మెల్యే అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు కోసం అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

April 10, 2026 / 05:26 PM IST

సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజా దర్బార్: ఎమ్మెల్యే

ASR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ‘ప్రజా దర్బార్’ అని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె పాడేరుల క్యాంపు కార్యాలయంలో అర్జీలు స్వీకరించారు. తాగునీరు, పెన్షన్లు, డ్రైనేజీ సమస్యలపై వచ్చిన వినతుల్లో కొన్నింటిని అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి అధికారులకు సిఫారసు చేశామన్నారు.

April 10, 2026 / 05:26 PM IST

అడ్వకేట్ మిస్సింగ్ పై కేసు నమోదు

KDP: మైలవరం పోలీస్ స్టేషన్‌లో దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన అడ్వకేట్ పల్లా బాలుగ్రం మిస్సింగ్ ఘటనపై కేసు నమోదు అయింది. ఈ నెల 6వ తేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని అతని భార్య సుదర్శన దేవి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని మైలవరం ఎస్సై కోరారు.

April 10, 2026 / 05:25 PM IST

టీడీపీ కార్యాలయంలో సర్పంచ్‌ల సత్కారం

CTR: కుప్పం నియోజకవర్గంలో పదవీకాలం పూర్తి చేసిన 14 మంది సర్పంచ్‌లను MLC కంచర్ల శ్రీకాంత్ రెడ్డి, మునిరత్నం టీడీపీ కార్యాలయంలో శాలువాలతో సత్కరించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

April 10, 2026 / 05:20 PM IST

రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

NTR: కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో డోనబండ–కీసర రాష్ట్ర రహదారి మెరుగుదల పనులకు శంకుస్థాపన జరిగింది. రూ.1.50 కోట్ల వ్యయంతో కిలోమీటర్ 14 నుంచి 21 వరకు ఆర్&బీ రోడ్డు అభివృద్ధి చేపట్టనున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈ కార్యక్రమంలో పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ రోడ్డు పూర్తైతే రైతులకు మరింత ఉపయోగంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

April 10, 2026 / 05:15 PM IST

పులివెందుల యువతి గ్రేట్..!

KDP: పులివెందుల పట్టణానికి చెందిన అనిలాదేవి, గురుదత్తల కుమార్తె సాయి వర్షిత తాజాగా విడుదలైన SSC CGL ఫలితాల్లో సత్తాచాటారు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆమె గతేడాది ఐదు సెంట్రల్ జాబ్స్ సాధించి ఔరా అనిపించారు. న్యాయ శాస్త్రం చదివిన ఐదేళ్లలో నాలుగు బంగారు పతకాలు సాధించడం విశేషం. ఆమెను పలువురు అభినందించారు.

April 10, 2026 / 05:14 PM IST

దెందులూరు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యం

ELR: పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి అర్జీలు స్వీకరించారు. అలాగే వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే దెందులూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు.

April 10, 2026 / 05:14 PM IST

అధ్యాపకుల కృషితో ‘ఎ’ గ్రేడ్ సాధించాం: ప్రిన్సిపాల్

అన్నమయ్య: మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అకాడమిక్ ఆడిట్‌లో ‘ఎ’ గ్రేడ్ లభించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఆడిట్‌లో ఆడిటర్లు డాక్టర్ రుక్మిణి, డాక్టర్ గులాబ్ జాన్ కళాశాల నిర్వహణ, బోధనా విధానాలను పరిశీలించి ఈ గ్రేడ్‌ను ప్రకటించారు. ఈ విజయానికి అధ్యాపకుల కృషి కారణమని ప్రిన్సిపాల్ వనజ తెలిపారు.

April 10, 2026 / 05:12 PM IST

ఆలూరులో టీడీపీ గ్రీవెన్స్ డే నిర్వహణ

KRNL: ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల సమస్యలు ఫిర్యాదు చేశారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఇంఛార్జ్ హామీ ఇచ్చారు.

April 10, 2026 / 05:11 PM IST

భీమవరంలో ప్రజా వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం

W.G: భీమవరం నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజావేదిక గ్రీవెన్స్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ తోట సీతారామ లక్ష్మీ పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలు సేకరించారు. అలాగే వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

April 10, 2026 / 05:10 PM IST

తోట్లవల్లేరులో CMRF చెక్కులు పంపిణీ

కృష్ణా: తోట్లవల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా లబ్ధిదారులకు CMRF చెక్కులు శుక్రవారం పంపిణీ చేశారు. సయ్యద్ అమీనాకు రూ. 45,905, సింహాద్రి రాజేష్ బాబుకు రూ. 26,218 పాముల చంటిబాబుకు రూ. 31,843, యేమినేని శ్రీలక్ష్మికు రూ.30,786, బడుగు నాగమణికు రూ.30,028ల చెక్కులు అందజేశారు.

April 10, 2026 / 05:09 PM IST

కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే

TPT: పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల 43వ వార్షికోత్సవంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. రూసా నిధులతో రూ.24.63 లక్షల వ్యయంతో నిర్మించిన మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. విద్యార్థులు కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

April 10, 2026 / 05:07 PM IST

క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కలెక్టర్

SS: బుక్కపట్నం డైట్ కళాశాల వీడ్కోలు వేడుకలకు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ట్రైనీ ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు సమయపాలన, క్రమశిక్షణ అలవర్చుకుని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు.

April 10, 2026 / 05:05 PM IST