• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యతలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా సీఎం చంద్రబాబు “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ఈరోజు విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో గల చెరువు వద్ద ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ప్రారంభించారు. భూగర్భ జలాలను పెంచడం, చెరువులను పూడికతీసి నీటిని సంరక్షించడం ప్రధాన లక్ష్యమన్నారు.

April 6, 2026 / 05:14 PM IST

శరవేగంగా కసాపురం ఆలయ నిర్మాణ పనులు

ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో దాతల సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కోనేరుతో పాటు ఆలయంలో స్వామివారి గర్భగుడి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో విజయ రాజు పేర్కొన్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు.

April 6, 2026 / 05:10 PM IST

పాక్స్ నూతన భవనాన్ని ప్రారంభించిన కేడీసీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన భవనాన్ని KDCC బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ.. సహకార రంగం రైతులకు నిజమైన ఆర్థిక భరోసా కల్పించే బలమైన వేదికగా మారిందని తెలిపారు.

April 6, 2026 / 05:05 PM IST

నల్ల బ్యాడ్జిలతో ఉపాధ్యాయులు నిరసన

AKP: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు అనకాపల్లి పదవ తరగతి స్పాట్ కేంద్రం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన తెలియజేశారు. ప్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలన్నారు. అప్పటివరకు మధ్యంతర భృతిని ఇవ్వాలన్నారు.

April 6, 2026 / 05:01 PM IST

పుట్టపర్తిలో గవర్నర్‌కు ఘన వీడ్కోలు

సత్యసాయి: అనంతపురం జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు పూలబొక్కే అందజేసి వీడ్కోలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

April 6, 2026 / 05:00 PM IST

రెండు మగ దూడలకు జన్మనిచ్చిన ఆవు

CTR: పూతలపట్టు మండలం దిగువ పాలకురు గ్రామానికి చెందిన దాము అనే రైతు ఆవు ఒకేసారి రెండు మగ దూడలకు జన్మనిచ్చింది. ఈ ఘటన గ్రామంలో ఆసక్తిని రేకెత్తించింది. రెండు దూడలు ఆరోగ్యంగా ఉండటంతో రైతు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు కూడా ఈ దృశ్యాన్ని చూసేందుకు అక్కడికి చేరుకుంటున్నారు.

April 6, 2026 / 05:00 PM IST

జూద స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురు అరెస్ట్

BPT: పర్చూరు సీఐ పరిధిలోని చెన్నుబొట్ల అగ్రహారం గ్రామంలో జూదం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు జూదరులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,580 నగదు స్వాధీనం చేసుకున్నారు.

April 6, 2026 / 05:00 PM IST

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ

PLD: సత్తెనపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్‌లో అయ్యప్ప స్వామి 16వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తి భావంతో నిర్వహిస్తున్న ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సత్సంకల్పాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

April 6, 2026 / 05:00 PM IST

తల్లి చెల్లికి ఒకేసారి తలకొరివి

SKLM: మందస మండలం పెద్దకేసుపురం గ్రామంలో ఆదివారం పిడుగుపాటుకు గురై తల్లి కూతురు మృతి చెందిన విషయం తెలిసిందే. గత ఐదు నెలల క్రితం తండ్రి మృతి చెందడంతో తల్లి మడియా కృష్ణకుమారి(38), చెల్లి యోగేశ్వరి(15)తో కలిసి నిఖిత (18) జీవనం సాగిస్తోంది. పిడుగు రూపంలో అమ్మ, చెల్లి మృతి చెందడంతో ఒంటరిగా మిగిలిన నిఖిత సోమవారం ఇరువురికి తలకొరివి పెట్టింది.

April 6, 2026 / 04:53 PM IST

మార్కాపురం కలెక్టరేట్ వద్ద భవన కార్మికుల ధర్నా

ప్రకాశం: మార్కాపురం కలెక్టర్ కార్యాలయం ఆవరణ వద్ద బిల్డింగ్ నిర్మాణ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో కార్మికులు భవన కార్మిక సంక్షేమ బోర్డులో గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు జిల్లా కార్యదర్శి షేక్ అన్వర్ భాష అందజేశారు.

April 6, 2026 / 04:45 PM IST

కోడుమూరులో కూలీన ఇంటి మిద్దె..!

KRNL: కోడుమూరులోని మెయిన్ బజార్‌లో చేనేత కార్మికుడు బండ చంద్రశేఖర్ ఇంటి మట్టి మిద్దె గత రాత్రి కూలిపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటనలో తల్లి, కూతురికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు ఘటన స్థలాన్ని ఇవాళ పరిశీలించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం చేసి ఇల్లు నిర్మాణం, మగ్గం ఏర్పాటు చేయలన్నారు.

April 6, 2026 / 04:45 PM IST

‘నీటి భద్రతతోనే జల మట్టం పెంపు’

ASR: పాడేరులో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ‘నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ 100 రోజుల కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, కలెక్టర్ నిశాంతితో కలిసి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు జలమట్టాన్ని 1.5 మీటర్లు పెంచాలని ఆమె అధికారులకి సూచించారు. పంచసూత్రాలు అమలుచేస్తూ ప్రతి నీటిబొట్టును కాపాడుకోవాలని, ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆమె కోరారు.

April 6, 2026 / 04:36 PM IST

లబ్ధిదారులకు CMR చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CTR: చిత్తూరు నగరంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్ లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ.38,51,938 విలువైన చెక్కులను అందజేశారు. నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులు ఈ చెక్కులను పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

April 6, 2026 / 04:31 PM IST

ప్రాజెక్టుకు పూర్తి అనుమతులు నేటికీ రాలేదు: జూలకంటి

PLD: వరికిపూడిశెల ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిస్థాయి అనుమతులు నేటికీ రాలేదని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. సోమవారం మాచర్ల పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు ప్రాజెక్టుపై సరియైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అటవీ శాఖ అనుమతులు రాగానే అన్ని అనుమతులు వచ్చాయని అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు.

April 6, 2026 / 04:30 PM IST

జిల్లాలో భారీ వర్షం.. పిడుగుపాటుతో ఒకరు మృతి

ప్రకాశం: పుల్లలచేరువులో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా గ్రామంలో పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

April 6, 2026 / 04:30 PM IST