TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి, బయట ATGH వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 79,426 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 25,889 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
కడప: రాజంపేట, పులపుత్తూరు గ్రామ అభివృద్ధి బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని TDP నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు మంగళవారం తెలిపారు. అన్నమయ్య డ్యామ్ ఘటనలో నష్టపోయిన గ్రామాన్ని 3 నుంచి 4 నెలల్లో మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తామని, పునరావాస గృహాల నిర్మాణం, రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బాధితులను పరామర్శించారు.
సత్యసాయి: ధర్మవరం పోతుకుంట ఏరియా ఆసుపత్రిలో శంకర నేత్రాలయ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. ఇప్పటి వరకు 727 మందికి పరీక్షలు చేసి, 135 మందికి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
PLD: అమరావతి మండలం దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ నెల 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
CTR: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఇవాళ ప్రభుత్వం విడుదల చేయనుంది. జిల్లాలో ఇంటర్మీ డియట్ పరీక్షలు రాసిన 29,279 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 14,729 మంది ఫస్టియర్ కాగా, 14,550 మంది సెకండియర్ విద్యార్థులున్నారు. ఆసక్తిగా విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
SKLM: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను తాడేపల్లిలో తన నివాసంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా రాజకీయ ముఖచిత్రం పై ప్రస్తుత పరిస్థితులను జగన్ వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం పై దృష్టి సారించాలని జగన్ సూచించారు.
TPT: చంద్రగిరిలో అన్న క్యాంటీన్‌ను ఇవాళ సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. రూ.61 లక్షల తుడా నిధులతో చంద్రగిరిలో అన్న క్యాంటీన్ నిర్మించారు. ఈ క్యాంటీన్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 500 మందికి పైగా భోజన ఏర్పాట్లు చేయనున్నారు. అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా ఏర్పాట్లు శరవేగంగా నిర్వహిస్తున్నారు.
VZM: గంట్యాడ మండలం సిరిపురం గ్రామంలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు కంచమ్మ తల్లి అమ్మవారి పండగను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పండుగ తేదీలను నిర్వాహకులు ఖరారు చేసారు. మే 3న తోలేల ఉత్సవం, 4న అమ్మవారి ఊరేగింపు, 5న కనుమ పండుగతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ మూడు రోజుల ఉత్సవాలకు గ్రామ పెద్దలు, గ్రామస్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
KKD: తుని మండలం తేటగుంట సమీపంలో జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. మంగళవారం అన్నవరం నుంచి తుని వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడడంతో 2,500 లీటర్ల డీజిల్ నేలపాలైంది. స్థానికులు డీజిల్‌ను బకెట్లతో ఎగబడి సేకరించడం ప్రారంభించారు. వెంటనే రూరల్ ఎస్సై కృష్ణమాచార్యులు చేరుకుని క్రేన్ సాయంతో ట్యాంకర్ బయటకు తీశారు .
ATP: ఉరవకొండ పట్టణంలో మంత్రి పయ్యావుల కేశవ్ నేడు ఉదయం 10:30 గంటలకు అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకంలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
NLR: పరిపాలన పరిశీలనలో భాగంగా బుధవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆత్మకూరు మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని బోయళ్ల చిరువెళ్ల, దేపూరు గ్రామాలలో పర్యటించి నబ్బినగరం వద్ద ఉపాధి హామీ పనులను పరిశీలిస్తారు. అనంతరం బోయళ్ల చిరువెళ్ల గ్రామంలో హెల్త్ క్లినిక్, పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తారు. దేపూరు గ్రామ విజిటింగ్‌లో భాగంగా గ్రామసభలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.
కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బుధవారం పర్యటన వివరాలు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 11 గంటలకు కొత్తపేట గ్రామ పంచాయతీ వద్ద డ్వాక్రా యానిమేటర్లకు మొబైల్ ఫోన్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11:30 గంటలకు కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
KDP: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడని ఆసుపత్రి ఔట్‌పోస్ట్ పోలీసులు తెలిపారు. ఇవాళ సాయంత్రం ఎర్రగుంట్ల మండలం వెంకటాపురం గ్రామం వద్ద అపస్మారక స్థితిలో పడిఉన్న గుర్తు తెలియని వ్యక్తిని 108 అంబులెన్స్‌లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారన్నారు. అతని సంబంధీకులు ఆసుపత్రి వద్దకు రావాలని కోరారు.
CTR: ఐపీఎల్ మ్యాచ్‌ల పేరుతో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని చిత్తూరు 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో దాడులు నిర్వహించిన పోలీసులు, ఐదుగురిని అదుపులోకి తీసుకోగా విచారణ అనంతరం ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ ముఠాలోని మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉం...
W.G: నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం నరసాపురం రుస్తుంబాద శివారు మండవారి గరువు ప్రాంతంలో ప్రభుత్వ భూములను అధికారులతో కలసి పరిశీలించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, నిర్దేశిత విధానాల ప్రకారం పనులు వేగవంతం చేయాలన్నారు.