• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వడ్డే ఓబన్నను గౌరవించుకోవాలి: ఎంపీ అంబిక

అనంతపురం పీటీసీ సమీపంలో వడ్డే ఓబన్న విగ్రహ ఏర్పాటుకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమి పూజ చేశారు. వడ్డే సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర పోరాట వీరుడు ఓబన్న విగ్రహాన్ని నగరంలో ప్రతిష్టించడం సంతోషకరమన్నారు. ఆయన ఆశయాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

April 5, 2026 / 12:41 PM IST

లారీ, కారు ఢీ.. తప్పిన ప్రాణాపాయం

అన్నమయ్య: చిట్వేలి- రాపూరు ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. చిట్వేలి నుంచి నెల్లూరు వెళ్తున్న లారీ, నెల్లూరు నుంచి వస్తున్న కారు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో కారులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

April 5, 2026 / 12:35 PM IST

తాడేపల్లిగూడెంలో విద్యుత్ మీటర్ల ఏరియా కోడ్ మార్పు

W.G: తాడేపల్లిగూడెంలో విద్యుత్ డివిజన్ పరిధిలో పట్టణ విద్యుత్ వినియోగదారుల మీటర్ల ఏరియా కోడ్‌ను ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మార్పు చేసిందనీ DE ఎం.వెంకటేశ్వర రావు ఇవాళ తెలిపారు. బిల్లింగ్ సిస్టమ్స్‌లో వచ్చిన మార్పుల ఆధారంగా మీటర్ సర్వీస్ నెంబర్స్ మార్పు జరిగిందని ఈనెల బిల్లులో కొత్త నెంబర్‌ను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

April 5, 2026 / 12:30 PM IST

టీటీడీ ఛైర్మన్‌ను వెంటనే తొలగించాలి: కుందూరు

ప్రకాశం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని వెంటనే తొలగించాలని గిద్దలూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బెస్తవారిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ నాయుడు ప్రవర్తన మహిళల పట్ల అసభ్యకరంగా ఉందని అన్నారు. హిందువుల పవిత్రతను కాపాడేందుకు వెంటనే కూటమి ప్రభుత్వం టీటీడీ ఛైర్మన్‌ని తొలగించాలన్నారు.

April 5, 2026 / 12:26 PM IST

టీడీపీ కార్యాలయ భవన్‌లో బాబు జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళులు

GNTR: మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డా. ఎమ్మెస్సెస్ భవన్‌లో భారతదేశ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సేవలను స్మరించారు.

April 5, 2026 / 12:23 PM IST

డోన్‌లో వాకింగ్.. రాక్ నిర్లక్ష్యంపై మాజీమంత్రి ఆగ్రహం

NDL: డోన్‌లో మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్&బీ గెస్ట్ హౌస్‌లో ఇవాళ ఉదయం వాకింగ్ చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్‌ను అధికారులు నిర్లక్ష్యం చేసి నిరుపయోగంగా మారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .అలాగే ఎంపీడీవో కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 12:22 PM IST

బాబు జగజ్జీవన్ రామ్‌కు ఎమ్మెల్యే నివాళి

ELR: ఉంగుటూరు గ్రామం హరిజన పేటలో బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ధర్మరాజు నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు అమూల్యమైనవన్నారు. అణగారిన వర్గాల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు.

April 5, 2026 / 12:20 PM IST

అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం.. ఎస్సైకు అభినందనలు

ఎన్టీఆర్: డెలివరీ నిమిత్తం అత్యవసర సమయంలో తిరువూరు హాస్పిటల్‌లో రక్తం అవసరమైంది. దీంతో వెంటనే స్పందించి విధి నిర్వహణలో ఉన్న సెక్టార్ 2 ఎస్సై రాజు క్షణాల వ్యవధిలో హాస్పిటల్‌కి వచ్చి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. దీంతో ఆదివారం డాక్టర్ సూరపనేని వనజ (సీనియర్ గైనకాలజిస్ట్) ఎస్సైకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఇలానే రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు.

April 5, 2026 / 12:20 PM IST

కోనసీమలో తగ్గిన కూరగాయల ధరలు

కోనసీమ: అమలాపురం మార్కెట్లో ఆదివారం కూరగాయల ధరలు తగ్గాయి. టమాటా రూ.20, బంగాళదుంప, ఉల్లిపాయలు రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. వంకాయ, కాకర రూ.40, బీరకాయ, క్యారెట్ రూ.50 పలుకుతున్నాయి. పంటలు ఒక్కసారిగా కోతకు రావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారస్థులు తెలిపారు. ప్రాంతాలను బట్టి రేట్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చన్నారు.

April 5, 2026 / 12:20 PM IST

జిల్లాలో చలివేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే

తిరుపతిలో బీజేపీ ‘మన ఊరు-మన జెండా’ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు  చలివేంద్రంను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. జిల్లాలోని టౌన్ క్లబ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 12:16 PM IST

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రకాశం: పామూరు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ప్రైవేట్ పాఠశాల టీచర్ మాధవిని లైంగికంగా వేధించి ఆత్మహత్యకు కారణమైన నాగూర్ బాషాను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఓ దినపత్రికలో పనిచేస్తున్న పాత్రికేయుడిగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మండల వైసీపీ మైనార్టీ కార్యదర్శిగా నాగూర్ బాషా పనిచేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

April 5, 2026 / 12:14 PM IST

ఎంపీడీవో కార్యాలయంలో జగ్జీవన్ రామ్‌కు నివాళి

NLR: ఉదయగిరిలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి జరిగింది. ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సిబ్బంది నివాళులర్పించారు. దళిత నాయకుడిగా, భారత ఉప ప్రధానిగా ఆయన పలువురికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అటువంటి మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.

April 5, 2026 / 12:10 PM IST

కేజీహెచ్ దాడికి పాల్పడిన వారిపై కేసు

VSP: కేజీహెచ్ లోని రాజేంద్రప్రసాద్ వార్డులో జగదీష్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఈ నెల 1న మృతిచెందారు. దీంతో ఆవేదన చెందిన అతని బంధువులు ఆసుపత్రిలో ఫర్నిచర్ను ధ్వంసం చేసి విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్పై దాడికి పాల్పడ్డారు. దీనిపై ఆర్ఎంవో ఆర్వీఎస్ కుమార్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ పూడి వరప్రసాద్ సంఘటనపై పరిశీలన చేసి పలువురిపై కేసు నమోదు చేశారు.

April 5, 2026 / 12:02 PM IST

KGH దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు

VSP: కేజీహెచ్ లోని రాజేంద్రప్రసాద్ వార్డులో జగదీష్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఈ నెల 1న మృతిచెందారు. దీంతో ఆవేదన చెందిన అతని బంధువులు ఆసుపత్రిలో ఫర్నిచర్ను ధ్వంసం చేసి విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్పై దాడికి పాల్పడ్డారు. దీనిపై ఆర్ఎంవో ఆర్వీఎస్ కుమార్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ పూడి వరప్రసాద్ సంఘటనపై పరిశీలన చేసి పలువురిపై కేసు నమోదు చేశారు.

April 5, 2026 / 12:02 PM IST

వస్త్ర దుకాణంలో భారీ చోరీ

ప్రకాశం: అద్దంకి పట్టణంలోని పొట్టి శ్రీరాములు బజారులో భారీ చోరీ జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆకృతి సిల్క్స్ వస్త్ర దుకాణంలోకి ప్రవేశించి కౌంటర్‌లో ఉన్న రూ. 5 లక్షలు నగదు దోచుకు వెళ్లారు. దుకాణ యజమాని ఫిర్యాదుతో పోలీసులు చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

April 5, 2026 / 12:01 PM IST