PPM: సీతానగరం మండలం చినభోగిలిలో బుధవారం 104 వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 45 మందికి వైద్య పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLHP నవీన్ మాట్లాడుతూ.. ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండలో తిరగడం పూర్తిగా నివారించాలన్నారు.
AKP: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సేవలలో పారదర్శకత, సమయపాలన పాటించాలన్నారు. అలాగే, నాలుగవ విడత జిల్లాలో జరుగుతున్న భూసర్వేను వేగవంతం చేయాలన్నారు.
ASR: అరకులోయ మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల (PTG) పాఠశాలను జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు వంతల దేవదాసు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వసతి గృహాలు, వంటశాల, భోజన మెనూను పరిశీలించారు. విద్యార్థులకు గుడ్లు, అరటిపండ్లు, పల్లీ చీక్కీలు అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
CTR:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ జవహర్, కార్యదర్శి చిన రాములు ఐఏఎస్‌లను జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్సీ వర్గాల సమస్యలు మరియు వారి అభివృద్ధిపై చర్చించారు. ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్డైరెక్టర్ బాబు పాల్గొన్నారు.
E.G: ఇళ్లు లేని అర్హులందరికీ త్వరలోనే టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయంలో మున్సిపల్ & రెవెన్యూ అధికారులతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం నాటికి మెయిన్ డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేస్తాం అన్నారు.
W.G: తాడేపల్లిగూడెం అధికవి నన్నయ యూనివర్సిటీలో బుధవారం మెడికల్ క్యాంపును ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. అకీరా వైద్య సిబ్బంది సుమారు 200 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి లంచం ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఇవాళ నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ అజయ్ కుమార్‌కు ఫిర్యాదు చేస్తూ.. లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ వివాదం రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశముందని హెచ్చరించారు. షాహీ జామియా మసీదులో ఎన్నికలు నిర్వహించి అభివృద్ధికి మార్గం సుగమం చేయాలని సూచించారు.
ELR: ఉంగుటూరు (M) తల్లాపురం పాఠశాల HM నల్లా నాగేంద్ర ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం బుధవారం జరిగింది. ఉంగుటూరు MEO నెం1. రవీంద్ర భారతి చేతులమీదుగా ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు 1వ తరగతిలో చేరడానికి 8 మంది పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తలిదండ్రులు పాల్గొన్నారు.
GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావేదిక’ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
KRNL: హాలహర్వి మండలంలోని 15 గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో వరలక్ష్మి ఇవాళ తెలిపారు. బాపురం, కామినహల్, మెదేహలకు బీ.లక్ష్మీనారాయణ, బెవినహల్ తదితర గ్రామాలకు కే.శ్రీనివాసరెడ్డి, హాలహర్వి పరిధిలోని గ్రామాలకు పీ.రామాంజినేయులు, మిగిలిన గ్రామాలకు వరలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి గ్రామాల అభివృద్ధి పనులు సమర్థంగా నిర్వహించాలన్నారు.
SKLM: అమరావతి ఒక అంతులేని దోపిడీ అని, రాజధానిగా ‘మావిగన్’ మాత్రమే ఆచరణ సాధ్యమని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస తన కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణానికి రూ. 401 కోట్లు ఖర్చు చేశారని, ఇది దోపిడీకి నిదర్శనం అని అన్నారు.
కోనసీమ: ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. అమలాపురంలో వైసీపీ నేతలు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చిన దగ్గరనుంచి కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదని అన్నారు. అందుకే రాధాకృష్ణ విష ప్రచారం చేస్తున్నారన్నారు.
KDP: YCP అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్‌పై ABN ఛానల్లో మహిళలను కించపరిచేలా ప్రసారం చేయడం నీచమైన చర్య అని YCP రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి అన్నారు. బుధవారం సిద్ధవటం (మం) భాకరాపేటలో ఆమె మాట్లాడారు. రాధాకృష్ణ ఒక ఛానల్ ఎండిగా సమాజాలకి ఆదర్శంగా ఉండాల్సింది పోయి మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
NDL: మహానంది రెగ్యులర్ తహసీల్దారుగా పీ. రమాదేవిని నియమిస్తూ బుధవారం కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహసీల్దారుగా ఉన్న ఆమెకు తహసీల్దారుగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం మహానంది మండలంలో తాత్కాలిక తహసీల్దారుగా (FAC) పనిచేస్తున్న ఆమె.. పదోన్నతిపై మండలంలో విధులు నిర్వహించనున్నారు.
W.G: ఉండి జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం లయన్స్ క్లబ్ పాఠశాలకు గ్రీన్ కార్పేట్ అందజేశారు. క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ.. విద్యతో పాటు యోగాసనాలు నేర్చుకుంటే విద్యలో మరింత రాణించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగప్రసాదరాజు, శివరామరాజు, బ్రహ్మారెడ్డి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.