• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పీఎం సూర్య ఘర్ యోజన ఉత్సవ్‌ను ప్రారంభించిన కలెక్టర్

E.G: తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం SC, ST ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. SC, ST కుటుంబాల విద్యుత్ ఖర్చులు తగ్గించడం, స్వయం సమృద్ధిని పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు.

April 8, 2026 / 01:29 PM IST

సచివాలయాల్లో తనిఖీ చేసిన ఎంపీడీవో

SKLM: పొందూరులోని మొదలవలస సచివాలయాన్ని బుధవారం ఎంపీడీవో వాసుదేవరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పలు ఫైళ్లను తనిఖీ చేసి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూనిఫైడ్ సర్వే, ఇంటి పనులు చెల్లింపు మొదలగు వివరాలను పరిశీలించి సిబ్బందికి నిర్దేశం చేశారు. ప్రత్యేక అధికారి పాలన విషయం గురించి చర్చించారు

April 8, 2026 / 01:24 PM IST

నెల్లూరు జిల్లాలో SIల బదిలీలు రద్దు..?

నెల్లూరు జిల్లాలో ఇటీవల పదిమంది ఎస్సైలను బదిలీ చేశారు. ఈ మేరకు 4వ తేదీన ఎస్పీ అజిత వేజెండ్ల పేరిట ఉత్తర్వులు విడుదలయ్యాయి. వీటిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. పరిపాలనా కారణాలతో ఈ బదిలీలను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కసారిగా అంతమంది పోలీసులను బదిలీ చేయడం, చివరకు ఆర్డర్స్ రద్దు చేయడంపై చర్చ జరుగుతోంది.

April 8, 2026 / 01:14 PM IST

ముసిడిపాలెం ప్రత్యేక అధికారిగా సోమశేఖర్

AKP: ముసిడిపాలెం పంచాయతీ ప్రత్యేక అధికారిగా నియమితులైన మండల ఇంజనీరు సోమశేఖర్‌ను టీడీపీ నాయకులు లగుడు శ్రీనివాసరావు, రుత్తల రమణమ్మ, లగుడు గోవిందు సత్కరించారు. ఈ సందర్బంగా శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని కోరగా, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని సోమశేఖర్ హామీ ఇచ్చారు.

April 8, 2026 / 01:13 PM IST

నందమూరి బాలకృష్ణను కలిసిన హనుమప్ప

సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఆయన కార్యాలయంలో కలిసి బాలకృష్ణకు పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనులపై ఇరువురు కాసేపు చర్చించారు.

April 8, 2026 / 12:53 PM IST

చెరువుల పనులకు రూ.2.45 కోట్లు మంజూరు

ATP: రాయదుర్గం నియోజకవర్గంలోని 13 చెరువులు, కుంటల ఆధునీకరణకు ప్రభుత్వం రూ.2.45 కోట్లు మంజూరు చేసింది. కట్టలు, తూముల మరమ్మతులు చేపట్టి, వర్షపు నీటిని నిల్వ చేయడమే దీని లక్ష్యం. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. దీనివల్ల సాగునీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాలు వృద్ధి చెంది రైతులకు మేలు జరుగుతుంది.

April 8, 2026 / 12:53 PM IST

పోలీస్ అవుట్ పోస్టును ప్రారంభించిన సీపీ

కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి కప్పరాడ వద్ద పోలీస్ అవుట్ పోస్టును సీపీ శంఖబ్రత బాగ్చి, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బుధవారం ప్రారంభించారు. విశాఖ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో ప్రమాదాల నివారణకై ఈ అవుట్ పోస్ట్ దోహద పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ-2 మేరీ ప్రశాంతి, సీఐ రవికుమార్, కూటమి నేతలు పాల్గొన్నారు.

April 8, 2026 / 12:52 PM IST

రెండు నెలలు చేపల వేట నిషేధం

SKLM: ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధిస్తున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు నిబంధనలు వర్తిస్తాయి. జిల్లాలో 193 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉండగా, 11 మండలాల పరిధిలో 1,565 మెకనైజ్డ్ బోట్లు, 2557 సంప్రదాయ పడవలు ఉన్నాయి. మత్స్యకారులకు రూ. 20 వేలు ప్రభుత్వం అందజేస్తుంది.

April 8, 2026 / 12:52 PM IST

‘జీడి మామిడి రైతులను ఆదుకోవాలి’

AKP: జీడిమామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వై. పాపారావు డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పూత దశలో పొగమంచు ప్రభావం, ప్రస్తుతం వర్షాలతో నష్టాలు పెరిగాయని, ప్రభుత్వం తక్షణం పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

April 8, 2026 / 12:50 PM IST

తల్లిపాల బ్యాంక్ సేవలు అమోఘం: ఎమ్మెల్యే

ATP: అనంతపురం మదర్ మిల్క్ బ్యాంక్ మొదటి వార్షికోత్సవం ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై సేవలను పరిశీలించారు. ఇప్పటి వరకు 480 లీటర్ల పాలు సేకరించి, 4 వేల మంది చిన్నారులకు అందించడం గర్వకారణమని ఎమ్మెల్యే కొనియాడారు.

April 8, 2026 / 12:43 PM IST

ఎమ్మెల్యే ను కలిసిన ఎస్సై

ELR: బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్సై గా నూతన బాధ్యతలు స్వీకరించిన పి. చెన్నారావు బుధవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ న్యాయం, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెంపొందించే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు..

April 8, 2026 / 12:42 PM IST

అనంతపురంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

ATP: జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం రైల్వే స్టేషన్, బస్ స్టాండ్‌లలో త్రీటౌన్, ఈగల్ టీం పోలీసులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గంజాయి రహిత జిల్లా లక్ష్యంగా నార్కోటిక్స్ డిటెక్షన్ జాగిలం ‘టైగర్’ సహకారంతో రైళ్లు, బస్సులు, పార్సిల్ సర్వీసులను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, లగేజీ బ్యాగులను నిశితంగా పరిశీలించారు.

April 8, 2026 / 12:41 PM IST

వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం

W.G: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, పార్టీ నాయకుల భార్యలను నీచ, నికృష్టమైన భాషతో దూషించడం పట్ల వైసిపి శ్రేణులు బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తణుకు నరేంద్ర సెంటర్లో రాధాకృష్ణకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే రాధాకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

April 8, 2026 / 12:40 PM IST

నూతన పంచాయతీ కార్యదర్శుల నియామకం

BPT: పిట్టలవానిపాలెం మండలంలో ఇద్దరు నూతన పంచాయతీ కార్యదర్శులు నియమితులయ్యారు. పిట్టలవానిపాలెం గ్రామపంచాయతీ నూతన కార్యదర్శిగా షేక్ అక్బర్ బాషా నియమితులయ్యారు. అలాగే, మండల పరిధిలోని సంగుపాలెం గ్రామపంచాయతీ కార్యదర్శిగా సీహెచ్.సురేష్ బాబును నియమించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

April 8, 2026 / 12:38 PM IST

‘శక్తి యాప్‌తోనే రక్షణ సాధ్యం’

SKLM: శక్తి యాప్ ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఉంటేనే పూర్తి రక్షణ లభిస్తుందని శక్తి టీం సభ్యుడు గిరిధర్ తెలిపారు. బుధవారం కోటబొమ్మాలి మండలం హరిశ్చంద్రపురంజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శక్తి యాప్ పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే శక్తి యాప్ ద్వారా రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ యాప్ లేకపోతే ఇబ్బందులలో ఉన్నట్టే అన్నారు

April 8, 2026 / 12:38 PM IST