• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌.. అర్జీల స్వీకరణ

PLD: జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను వివరించగా, సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

April 6, 2026 / 01:12 PM IST

ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

ELR: కొయ్యలగూడెం మండలం సీతంపేటలో బీజేపీ పార్టీ 46వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా యూవ మోర్చా నాయకులు పెనుమర్తి సురేష్ బాబు, మండల కిసాన్ మోర్చా రామినా రమేష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బాలం నరేష్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర నిధులు పథకాలు ప్రతి ఒక్కరికి అందడమే బీజేపీ లక్ష్యం అన్నారు.

April 6, 2026 / 01:10 PM IST

అనుమానాస్పదంగా యువకుడి మృతి

విశాఖ: మధురవాడ ఐటీ సెజ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా మృతి చెందిన యువకుడి మృతదేహన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన యువకుడు మణికంఠ (34)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

April 6, 2026 / 01:08 PM IST

అమరావతిపై వైసీపీ నేత విమర్శలు

PLD: సత్తెనపల్లిలో వైసీపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని పేరుతో ఒక సామాజిక వర్గానికి ఆర్థిక లాభం చేకూర్చే విధంగా 54వేల ఎకరాల భూములు సేకరించారని ఆరోపించారు. చట్ట సవరణ వల్ల ఆమోదం తీసుకురావడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు.

April 6, 2026 / 12:54 PM IST

జేసీబీ నడిపిన ఎమ్మెల్యే కందికుంట

SS: కదిరిలో జరిగిన నీటి సంరక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ‘జలధార’ స్ఫూర్తితో వాగులను అనుసంధానిస్తూ ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా జేసీబీ నడిపి పనులను ప్రారంభించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సాగునీటి వనరుల రక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

April 6, 2026 / 12:52 PM IST

జూద స్థావరాలపై దాడులు.. 16 మంది పట్టుబాటు

పాత గుంటూరు పోలీస్ పరిధిలో టాస్క్ ఫోర్స్ రెండు సార్లు దాడులు చేసి పేకాట నిర్వహిస్తున్న 16 మందిని అదుపులోకి తీసుకుంది. రూ.1,19,410 నగదు, 15 మొబైల్ ఫోన్‌లు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. జిల్లాలో జూదం సహించబోమని పోలీసులు హెచ్చరించారు.

April 6, 2026 / 12:50 PM IST

సబ్ కలెక్టర్ కార్యాలయంలో ‘గ్రీవెన్స్’ కార్యక్రమం

KRNL: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ AO వసుంధర ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. డివిజన్ పరిధిలోని వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఆదోని ప్రాంతంలో వేధిస్తున్న తీవ్రమైన తాగునీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

April 6, 2026 / 12:50 PM IST

రుస్తుంబాదలో బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్

W.G: నరసాపురం మండలం రుస్తుంబాదలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. మోకా దుర్గారావు తన పల్సర్ బైక్‌పై వెళ్తుండగా, టాయ్స్ సిటీ సమీపంలో టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆయనను నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

April 6, 2026 / 12:45 PM IST

బీజేపీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

E.G: అనపర్తి మండలం రామవరంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండాను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో నాయకులకు, కార్యకర్తలకు స్వీట్స్ పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో సుపరిపాలన లక్ష్యంగా సేవయే పరమావధి – దేశమే ప్రథమం అంటూ కొనసాగుతున్నారు.

April 6, 2026 / 12:44 PM IST

చెరువులకు సాగునీరు అందించాలి: ఎమ్మెల్యే

ATP: యాడికి మార్కెట్ యార్డులో నిర్వహించిన సభలో స్థానిక MLA జేసీ అస్మిత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీరు అందించాలని సీఎంకు విన్నవించారు. అలాగే యాడికి ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయాలని కోరారు. స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

April 6, 2026 / 12:44 PM IST

రాజమండ్రిలో ఈ నెల 7న జాబ్ మేళా

E.G: రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 7వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ సోమవారం తెలిపారు. పలు కంపెనీలోని ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. టెన్త్, ITI, డిప్లొమా, డిగ్రీ, MBA పూర్తిచేసిన 19 – 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 6, 2026 / 12:43 PM IST

గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన మంత్రి

KRNL: జేఎన్టీయూలో నిర్వహించనున్న స్నాతకోత్సవంలో పాల్గొనడానికి ఇవాళ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను మంత్రులు టీజీ భరత్, సవిత మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు.

April 6, 2026 / 12:40 PM IST

అన్న క్యాంటీన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

CTR: పూతలపట్టులో అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మురళీమోహన్ సోమవారం పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యవంతంగా.. వేగంగా పూర్తి చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ పథకం పేదల ఆకలి తీరుస్తున్నట్లు వెల్లడించారు.

April 6, 2026 / 12:38 PM IST

నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: ఎమ్మెల్యే బేబినాయన సోమవారం స్దానిక సీతారామ సాగరం ఎంబనవలస వద్ద నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత అనే 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా మట్టి తట్ట మోసి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడుతూ… రాబోయే 100 రోజుల్లో చెరువుల పూడికతీత, కట్టల బలోపేతంపై దృష్టి సారిస్తామన్నారు.

April 6, 2026 / 12:26 PM IST

ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై సీఎం ప్రశంసలు

ATP: యాడికి సభలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. అస్మిత్ రెడ్డి వినూత్న ఆలోచనలు కలిగిన ఉత్సాహవంతుడని కొనియాడారు. తాడిపత్రి నియోజకవర్గాన్ని ఆయన ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

April 6, 2026 / 12:25 PM IST