• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బస్సు కింద పడి చిన్నారి మృతి

GNTR: పెదనందిపాడు మండలం వరగానిలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాస పాఠశాల బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. బస్సు నుంచి చిన్నారి దిగుతుండగా ఒక్కసారిగా బస్సు ముందుకు కదిలింది. ప్రమాదవశాత్తు బస్సు కింద పడి అక్కడికక్కడే చిన్నారి దుర్మరణం చెందింది.

April 12, 2026 / 08:10 PM IST

చోరీ కేసును ఛేదించిన పోలీసులు

NTR: తిరువూరులో కుమ్మరి బజార్‌లో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో తూ.గో జిల్లా ఏడిద గ్రామానికి చెందిన నేరస్థుడు కందుల సత్యనారాయణను అరెస్ట్ చేశారు. సీఐ కే. గిరిబాబు నిందితుడిని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ముద్దాయి వద్ద నుంచి 30 గ్రాముల బంగారం, 2116 కేజీల వెండి, రూ.10 వేల నగదు, ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

April 12, 2026 / 08:10 PM IST

చీరాల యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ

BPT: చాట్రాసి ఫౌండేషన్ చీరాల నియోజకవర్గంలోని ఆమోదగిరిపట్నం పరిధికి చెందిన యువతకు వాలీబాల్ కిట్‌ను పంపిణీ చేశారు. యువత అభ్యర్థనపై రామకృష్ణపురం క్యాంప్ కార్యాలయంలో ఫౌండేషన్ ఛైర్మన్ చాట్రాసి రాజేష్ కిట్‌‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఎప్పుడైనా అవసరమైతే.. సహాయం కోసం తనను సంప్రదించాలని సూచించారు.

April 12, 2026 / 08:10 PM IST

స్లీపర్ బస్సు స్వాధీనం.. 40 వాహనాలపై కేసులు

తిరుపతి జిల్లా రవాణా శాఖ ప్రత్యేక తనిఖీల్లో ఒక స్లీపర్ బస్సు స్వాధీనం చేసుకుని, 40 వాహనాలపై కేసులు నమోదు చేశారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.6 లక్షల జరిమానా విధించారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ, ప్రజలు, వాహన యజమానులు రవాణా నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ కోరింది.

April 12, 2026 / 08:00 PM IST

జిల్లాలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహణ

కర్నూలు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని విడిచిపెట్టి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

April 12, 2026 / 07:54 PM IST

రేపు జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం

అన్నమయ్య: ఈ నెల 13న ఉదయం 8.30 నుంచి 9.30 వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్ఈ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. వినియోగదారులు 9440817449 ఈ నెంబరుకు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. సర్వీస్ నంబరు సిద్ధంగా ఉంచుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఫిర్యాదులపై తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

April 12, 2026 / 07:53 PM IST

POW జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

ELR: ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా వెట్టి భారతి, కే. లతలు ఎన్నికైనట్లు తెలిపారు. ఆదివారం జంగారెడ్డిగూడెం ధర్మన్న మెమోరియల్ హాల్‌లో POW జిల్లా నూతన కార్యవర్గాన్ని 15 మందితో ఎన్నుకున్నారు. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యపానాన్ని నిషేధించాలని, మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన దిశ నిర్భయ చట్టాలను అమలు చేయాలన్నారు.

April 12, 2026 / 07:50 PM IST

ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు 2,327 మంది హాజరు: DEO

కర్నూలు జిల్లాలోని 16 ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 2,614 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,327 మంది హాజరైనట్లు డీఈఓ సుధాకర్ తెలిపారు. పెద్దపాడు పాఠశాల సహా పలు కేంద్రాలను ఆయన సందర్శించి, నిర్వహణను పర్యవేక్షించారు. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పరీక్షలు జరిగినట్లు వెల్లడించారు.

April 12, 2026 / 07:47 PM IST

26న కాకానిపాలెంలో బ్రహ్మంగారి ఆరాధన

బాపట్ల జిల్లా అద్దంకి మండలం కాకానిపాలెంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఈనెల 26న మహోత్సవం జరగనుంది. ఈ మేరకు కమిటీ సభ్యులు ఈ రోజు కరపత్రాలను విడుదల చేశారు. ఈ మహోత్సవంలో సుప్రభాతం, అభిషేకాలు, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అఖండ జ్యోతి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

April 12, 2026 / 07:35 PM IST

రేపు జెడ్పీ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం

SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక మీ కోసం నిర్వహించ బడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 12, 2026 / 07:32 PM IST

జగన్ వ్యాఖ్యలపై ప్రజలు నవ్వుతున్నారు: మంత్రి

KRNL: మాజీ సీఎం జగన్‌పై ఆదివారం మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రెడిట్ గురించే మాట్లాడేవారికి క్రెడిబిలిటీ లేదన్నారు. ‘వైసీపీ హయాంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని వీడాయి. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో సానుకూలత ఉంది. అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. జగన్ వ్యాఖ్యలపై ప్రజలు నవ్వుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.

April 12, 2026 / 07:31 PM IST

విద్యుత్ స్తంభం కూలి.. నిలిచిన విద్యుత్ సరఫరా

VZM: గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం చినకాద గ్రామంలో ఆదివారం సాయంత్రం విద్యుత్ స్తంభం కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. శిదిలిమైపోయిన విద్యుత్ స్తంభం అకస్మాత్తుగా ఇంటిపైకి కూలిపోయినట్లు చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన కొత్త విద్యుత్ స్తంభాన్ని వేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రజల కోరుతున్నారు.

April 12, 2026 / 07:30 PM IST

యారాడలో జెట్టీకి వ్యతిరేకంగా గ్రామస్థుల నిరసన

VSP: యారాడ తీరంలో ప్రతిపాదిత జెట్టీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. జెట్టీ వల్ల సముద్రపు అలల మార్పుతో ఉప్పునీరు పంట భూముల్లోకి చేరి వ్యవసాయం నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పోర్టు కాలుష్యం, సముద్ర కోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలన్నారు.

April 12, 2026 / 07:30 PM IST

హ్యాపీ సండే కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

W.G: భీమవరం పట్టణంలో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం యోగా సాధన చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించవచ్చని వివరించారు.

April 12, 2026 / 07:27 PM IST

పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం

ATP: గుత్తి RS లోని జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో 2001లో టెన్త్ క్లాస్ చదువుకున్న విద్యార్థులు అపూర్వ సమ్మేళనం పేరుతో ఆదివారం కలుసుకున్నారు. శ్రీ సునామ జకినీ మాత ఆలయంలో పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులు పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. తమ చిన్ననాటి మిత్రులతో సరదాగా గడిపారు.

April 12, 2026 / 07:17 PM IST